iDreamPost
android-app
ios-app

TS: ఇంత అమానుషమా… విద్యార్థులను చితకబాదిన టీచర్‌

  • Published Feb 21, 2024 | 2:43 PM Updated Updated Feb 21, 2024 | 2:43 PM

ఈ మధ్యకాలంలో చాలామంది విద్యార్థులకు పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని అధిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాాజాగా ఓ ఉపాధ్యాయుడు, పరీక్షల్లో విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చాయని ఏం చేశాడంటే..

ఈ మధ్యకాలంలో చాలామంది విద్యార్థులకు పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని అధిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాాజాగా ఓ ఉపాధ్యాయుడు, పరీక్షల్లో విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చాయని ఏం చేశాడంటే..

  • Published Feb 21, 2024 | 2:43 PMUpdated Feb 21, 2024 | 2:43 PM
TS: ఇంత అమానుషమా… విద్యార్థులను చితకబాదిన టీచర్‌

ప్రతిఒక్క విద్యార్థికి తమ తల్లిదండ్రల తర్వాత మరొక ప్రత్యేక్ష దైవం విద్యను బోధించే గురువు. ఎందుకంటే.. ప్రతి విద్యార్థి గతిని, స్థితిని మార్చే ఏకైకా వ్యక్తి ఉపాధ్యాయుడు. మరి, అలాంటి గొప్ప స్థానాన్ని కలిగిన ఉపాధ్యాయుడు తమ విద్యార్థులను బిడ్డల్లా చూసుకోవాలి కానీ, కర్కషంగా ప్రవర్తించకూడదు. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది విద్యార్థులకు పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని అధిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేని విద్యర్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. అయిన ఉపాధ్యాయుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. తరగతి గదిలో అల్లరి చేసిన, చెప్పిన పనిని చేయకపోయినా, పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చిన వావి పట్ల చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ పాఠశాలలోని ఉపాధ్యాయుడు పరీక్షల్లో మార్కులు తక్కువ మార్కులు వచ్చాయని ఏం చేశాడంటే..

పదో తరగతి విద్యర్థులకు మార్కులు తక్కువగా వచ్చాయని కారణంతో.. పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు చితకబాదాడు. దీంతో విద్యార్ధుల వీపులపై వాతలు తేలాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లా చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలాయపాలెం మండలంలోని మాదిరిపురం అడ్డరోడ్డు వద్ద ఉన్న తెలంగాణ గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో.. పదో తరగతి చదివిన 62 మంది విద్యార్థులున్నారు. కాగా, త్వరలో పబ్లిక్‌ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో.. పదో తరగతి విద్యార్ధులకు తెలుగు ఉపాధ్యాయుడు లక్ష్మణ్‌రావు ఇటీవల గ్రాండ్‌ టెస్ట్‌ నిర్వహించారు. అయితే ఈ పరీక్షలో 100 మార్కులకు 51 నుంచి 71 వరకూ మార్కులు చాలామంది విద్యార్థులకు వచ్చాయి. దీంతో దాదాపు 25 మంది విద్యార్ధులకు తక్కువ మార్కులు వచ్చాయనే కారణంతో ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రావు బ్లాక్‌బోర్డు తుడిచే డస్టర్‌తో మంగళవారం రాత్రి విచక్షరహితంగా కొట్టాడు.

దీంతో ఆ దెబ్బలకు విద్యార్ధుల వీపులు ఎర్రగా కమిలిపోయాయి. అయితే ఈ విషయాన్ని కొందరు విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఫోన్‌లో తెలియజేశారు. దీంతో గురుకులానికి సమీపంలో ఉన్న చంద్రుతండాకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని ఉపాధ్యాయుణ్ని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఇక ఎస్సై గిరిధర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించినట్లు మీడియాకు తెలిపారు. మరి, మార్కులు తక్కువ వచ్చాయనే కారణంతో విచక్షరహితంగా విద్యర్థులకు కొట్టిన ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.