బ్రేకింగ్ న్యూస్: తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్ రాజీనామా

తెలంగాణలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పదవికి రాజీనామా చేశారు.

తెలంగాణలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పదవికి రాజీనామా చేశారు.

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె తన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండో గవర్నర్ గా ఆమె బాధ్యతలు నిర్వహించారు. తమిళిపై రాజీనామా విషయాన్ని రాజ్ భవన్ వర్గాలు దృవీకరించాయి. కాగా ఎన్నికల్లో పోటీచేసేందుకే తమిళిపై గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తమిళనాడు నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. తమిళిసై లోక్ సభ ఎన్నికల్లో కన్యాకుమారి, చెన్నై సౌత్‌, తిరునల్వేలి నుంచి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి.

కాగా తమిళిసై తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కొనసాగిన విషయం తెలిసిందే. ఆమె ఇప్పుడు ఈ పదవికి కూడా రాజీనామా చేశారు. ఆమె రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. ఇక తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని కొంతకాలంగా సాగుతున్న ప్రచారానికి మరింత ఊతమిచ్చినట్లైంది. కాగా తెలంగాణకు తొలి మహిళా గవర్నర్ గా 2019లో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత తమిళిసైకి కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ 2021లో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు మార్చి 18న రాజీనామా చేశారు.

Show comments