Nidhan
రిజల్ట్ డే వచ్చేసింది. రాజకీయ పార్టీలు, నేతలు, కార్యకర్తలతో పాటు సామాన్య జనం కూడా ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
రిజల్ట్ డే వచ్చేసింది. రాజకీయ పార్టీలు, నేతలు, కార్యకర్తలతో పాటు సామాన్య జనం కూడా ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
Nidhan
రిజల్ట్ డే వచ్చేసింది. రాజకీయ పార్టీలు, నేతలు, కార్యకర్తలతో పాటు సామాన్య జనం కూడా ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కొన్ని వారాల పాటు ఎన్నికల యుద్ధంలో కొట్లాడిన పార్టీలు.. ఇప్పుడు వాటి ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఇవాళ మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల లోపు గెలుపోటములపై ఓ క్లారిటీ కానుంది. ఈ తరుణంలో దేశంలో అందరి చూపు ఆంధ్రప్రదేశ్ మీద పడింది. ఏపీలో ఎవరు నెగ్గుతారనేది ఆసక్తికరంగా మారింది. దీంతో అందరూ ఇటు వైపు ఫోకస్ పెంచారు.
ఏపీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పిఠాపురం నియోజకవర్గం రిజల్ట్ కూడా ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పటికే అక్కడ కౌంటింగ్ కూడా మొదలైంది. అయితే పోస్టల్ బ్యాటెల్ ఓట్ల లెక్కింపులో అనూహ్య ఫలితం వెల్లడైంది. పిఠాపురం పోస్టల్ బ్యాటెల్ ఓట్లు అధికంగా చెల్లనివి నమోదైనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మిగతా అన్ని నియోజకవర్గాల కంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన పిఠాపురంలో ఎక్కువ ఓట్లు చెల్లనివిగా తేలడంతో అందరూ విస్మయానికి గురవుతున్నారు.