iDreamPost

కంచుకోటలోనూ ఓటమి.. లోక్ సభ ఎన్నికల్లో ప్రభావం చూపని BRS..

Lok Sabha Elections 2024: తెలంగాణలో జరుగుతున్న లోక్ సభ కౌంటింగ్ లో ఇప్పటి వరకు కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ కొనసాగుతుంది. పదేళ్ల పాలన కొనసాగించిన బీఆర్ఎస్ కనీసం ఒక్క స్థానంలో కూడా ముందంజలో నిలవలేకపోయింది.

Lok Sabha Elections 2024: తెలంగాణలో జరుగుతున్న లోక్ సభ కౌంటింగ్ లో ఇప్పటి వరకు కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ కొనసాగుతుంది. పదేళ్ల పాలన కొనసాగించిన బీఆర్ఎస్ కనీసం ఒక్క స్థానంలో కూడా ముందంజలో నిలవలేకపోయింది.

కంచుకోటలోనూ ఓటమి.. లోక్ సభ ఎన్నికల్లో ప్రభావం చూపని BRS..

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ జరుగుతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హూరా హూరీ పోటీ కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు కాంగ్రెస్ 8, బీజేపీ 8 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇదిలా ఉంటే తెలంగాణలో పదేళ్ల పాటు పరిపాలన కొనసాగించిన బీఆర్ఎస్ మాత్రం ఒక్క స్థానంలో కూడా ముందంజలో నిలవలేకపోయింది. ఉదయం మెదక్‌లో ఒక స్థానంలో ముందంజలో ఉండగా మధ్యాహ్నం వరకు ఫలితాలు తారుమారయ్యాయి. మెదక్ బీఆర్ఎస్‌కి కంచుకోట లాంటిదని అంటారు. కానీ  ప్రస్తుం అక్కడ బీజేజీ అభ్యర్థి రఘునందన్ రావు ముందంజలో ఉన్నారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు బీజేపీకి 18, కాంగ్రెస్ కు 8, ఎంఐఎం కు 1 సీటు రానున్నట్లు ఫలితాల సరళిని చూస్తుంటే అర్థం అవుతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి పదేళ్ల పాటు పాలన కొనసాగించింది. ఉద్యమ పార్టీగా ప్రజలు బీఆర్ఎస్ కి పట్టం కట్టినా.. తర్వాత జరిగిన పరిణామాలతో ఆ పార్టీపై వ్యతిరేకత చూపించారు. దాని ఫలితంగా గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసింది బీఆర్ఎస్. కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో అయినా సరే తమ ఉనికి చాటుకోవాలని గట్టి ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. కానీ ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో ఒక్క స్థానంలో కూడా ఖాతా తెరవలేకపోయింది. ఉదయం మెదక్ పార్లమెంట్ స్థానంలో ముందంజలో ఉన్నా.. తర్వాత రెండో స్థానానికి పరిమతం అయ్యింది. మొదటి నుంచి బీఆర్ఎస్ కి కంచుకోటాల ఉన్న మెదక్‌లో సైతం తమ ప్రాభవాన్ని చాటుకోకపోవంతో ఎక్కడ లోపం జరిగిందనే దానిపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు ఊహించని తీర్పు ఇచ్చారు. మొదటి నుంచి ఎన్నికల్లో విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ వచ్చిన బీఆర్ఎస్ పరాజయాన్ని పసిగట్టలేకపోయింది. దీనికి కారణం బీఆర్ఎస్ స్వయంకృతాపరాధమే కారణం అంటూ రాజకీయ నేతల్లో చర్చలు జరిగాయి.  పోనీ అవి సరిదిద్దుకొని పార్లమెంట్ లో అయినా సత్తా చాటాలని ఫిక్స్ అయితే.. ఈసారి మరీ ఘోర పరాభవం ఎదురైంది. కారణం ఏదైనా ఉండొచ్చు కానీ.. జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనిపై ఆ పార్టీ అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. ముందు ముందు ఎలాంటి సర్ధుబాట్లు చేసుకుంటారో తెలియాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి