P Krishna
Summer Heatwaves: ఇటీవల వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతున్నాయో అర్థం కావడం లేదు.. ఫిబ్రవరి మాసంలోనేే ఎండలు భగ భగమంటున్నాయి.
Summer Heatwaves: ఇటీవల వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతున్నాయో అర్థం కావడం లేదు.. ఫిబ్రవరి మాసంలోనేే ఎండలు భగ భగమంటున్నాయి.
P Krishna
తెలుగు రాష్ట్రాల్లో చల తీవ్రత వల్ల ప్రజలు గజ గజ వణికిపోయారు. ఉదయం మంచు దుప్పటి కప్పిందా అన్న చందంగా ఉండేది. ఎక్కడ చూసినా జనాలు వెచ్చదనం కోసం చలి మంటలు వేసుకున్న పరిస్థితి నెలకొంది. శీతాకాలం ఉదయం మంచు కురియడంతో ప్రయాణికులు, వాహనదారులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో పలు చోట్ల చలి తీవ్రత తట్టుకోలేక మరణాలు కూడా సంభవించాయి. ఇదిలా ఉంటే రెండు మూడు రోజుల నుంచి వాతావరణంలో హఠాత్తుగా మార్పులు వచ్చాయి.. పది గంటల నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. చలికాలం ఇంకా ముగియనేలేదు.. సూర్యుడు ఠారెత్తిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే..
సాధారణంగా మార్చి నుంచి ఎండలు మొదలై.. మే వరకు దంచికొడతాయి. కానీ ఇటీవల వాతావరణంలో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతున్నాయో అర్థం కాని పరిస్థితి. ఫిబ్రవరి నేలలోనే ఎండలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నిన్న మంగళవారం 36.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. బుధవారం కూడా దాదాపు అదే పరిస్థితి కొనసాగింది. టీఎస్‌డీపీఎస్ గణాంకాల ప్రకారం.. చార్మినార్, సరూర్ నగర్, కాప్రా, రాజేంద్ర నగర్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, ఖైరతాబాద్ పలు ప్రాంతాల్లో 35 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యింది.
గత ఏడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే ఉష్ణోగ్రతల్లో మార్పు గణనీయంగా పెరిగినట్లు కనిపిస్తుంది. గత ఏడాది కనీస ఉష్ణోగ్రత 16.5 డిగ్రీల సెల్సియస్ ఉండగా.. నిన్న 21 డిగ్రీలు నమోదయ్యింది. మారేడ్ పల్లిలో 2023 ఫిబ్రవరిలో 14.7 డిగ్రీలు ఉండగా.. నేడు 19.3 డిగ్రీలు నమోదయ్యింది. ఆదిలాబాద్ లో 8.0 ఉండగా.. ఇప్పుడు 17.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. మంచిర్యాల, కుమ్రంభీ ఆసీఫాబాద్ పరిసర ప్రాంతాల్లో గత ఏడాది కన్నా ప్రస్తుతం ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి. రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీహెచ్ అంచనా వేస్తున్నారు. సగటున గరిష్ట ఉష్ణోగ్ర 35 డిగ్రీల వరకు చేరవొచ్చని అంటున్నారు.