P Venkatesh
పిల్లలు తప్పు చేస్తే దండించాల్సిందిపోయి.. తప్పు చేసేలా వ్యవహరిస్తోంది పెద్దావిడా. గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లోనే దందా చేస్తోంది. పోలీసుల ఎంట్రీతో అసలు గుట్టు బయటపడింది.
పిల్లలు తప్పు చేస్తే దండించాల్సిందిపోయి.. తప్పు చేసేలా వ్యవహరిస్తోంది పెద్దావిడా. గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లోనే దందా చేస్తోంది. పోలీసుల ఎంట్రీతో అసలు గుట్టు బయటపడింది.
P Venkatesh
పెద్ద వాళ్లు ఎవరైనా తమ జీవితంలో గడించిన అనుభవంతో తమ కంటే చిన్న వాళ్లకు మంచి బుద్దులు నేర్పిస్తుంటారు. జీవితంలో ఎలా బ్రతకాలి. సన్మార్గంలో ఎలా నడుచుకోవాలనే విషయాలను పెద్ద వాళ్లు యువతకు చెబుతుంటారు. అయితే ఆ పెద్దావిడ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. డబ్బే లక్ష్యంగా పెట్టుకుని చేయకూడని పని చేస్తూ విరక్తి పుట్టేలా వ్యవహరిస్తోంది. యువతకు మంచి మాటలు చెప్పాల్సింది పోయి మత్తుకు బానిసలుగా చేస్తూ గంజాయి అమ్మకాలకు తెరలేపింది ముసలావిడ. పోలీసుల ఎంట్రీతో బామ్మ బండారం బయటపడింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
డ్రగ్స్ నివారణకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ వాటి అమ్మకాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. హైదరాబాద్ పోలీసులు మాదకద్రవ్యాల వినియోగం, రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ అడ్డుకట్ట పడడం లేదు. మత్తు పదార్థాలకు బానిసై యువత బంగారం లాంటి భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో ఎక్కడో ఒక చోట గంజాయి గుప్పుమంటూనే ఉంది. గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని రవాణా చేస్తున్నారు కేటుగాళ్లు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఫతేనగర్ ప్రాంతంలో ఒక వృద్ధురాలు గంజాయి ప్యాకెట్లు అమ్మకాలు జరుపుతుండగా ఎస్‌ఎఫ్‌టీ పోలీసులు పట్టుకున్నారు.
ఫతేనగర్‌లో షేక్‌జామీన్ బీ అనే వృద్ధురాలు గతకొంత కాలంగా గంజాయిని ప్యాకెట్ల రూపంలో యువకులకు అమ్ముతోంది. ఒక్కో ప్యాకెట్‌ను రూ.300 నుంచి 500లుగా అమ్ముతున్నట్టు ఎస్‌ఎఫ్టీ ఎస్ఐ బి. బాలరాజు తెలిపారు. పూరానాపూల్ ప్రాంతం నుంచి గంజాయిని కిలో రూ. 6 వేలకు కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ప్యాకెట్లుగా చేసి కిలో గంజాయిని రూ. 10 వేలకు అమ్ముతున్నట్లుగా నిందితురాలు ఒప్పుకున్నట్టు ఎస్ఐ తెలిపారు. ఇంట్లోనే గంజాయి అమ్మకాలకు తెరలేపిన వృద్ధురాలిని గంజాయితో పాటు న్యాయమూర్తి ముందు హజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.