Dharani
ఆర్మూరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వరుస షాకలు తగులుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే ఆర్టీసీ అధికారులు బకాయిలు చెల్లించాల్సిందిగా నోటీసులు జారీ చేయగా.. తాజాగా మరో షాక్ తగిలింది. ఆ వివరాలు..
ఆర్మూరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వరుస షాకలు తగులుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే ఆర్టీసీ అధికారులు బకాయిలు చెల్లించాల్సిందిగా నోటీసులు జారీ చేయగా.. తాజాగా మరో షాక్ తగిలింది. ఆ వివరాలు..
Dharani
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నిజామాబాద్, ఆర్మూర్ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డికి వరుస షాక్ లు తగులుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. జీవన్ రెడ్డికి.. ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులు బకాయిలు చెల్లించాల్సిందిగా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు మరో షాక్ తగిలింది. తమ వద్ద తీసుకున్న రూ.20 కోట్ల రుణంతో పాటు వడ్డీ రూ.25 కోట్లు మొత్తం కలిపి రూ. 45 కోట్లు చెల్లించాలంటూ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు జీవన్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఆర్మూర్‌లోని జీవన్ రెడ్డి ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు.
ఆరు సంవత్సరాల క్రితం.. ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.20కోట్లు రుణం తీసుకున్నారు. 2017లో ఆయన భార్య రజితా రెడ్డి పేరు మీద జీవన్ రెడ్డి ఈలోన్ తీసుకోగా ఇప్పటి వరకు ఆ డబ్బు చెల్లించలేదు. దీంతో, అసలు, వడ్డీ కలిసి రూ.45 కోట్ల బకాయి ఉందన్నారు అధికారులు. దీని గురించి ఎన్ని సార్లు నోటీసులు జారీ చేసినా.. జీవన్ రెడ్డి స్పందించలేదని తెలిపారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు.దాంతో ఈ అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉండగా, అంతకుముందు.. జీవన్‌రెడ్డికి.. ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులు బకాయిల వసూలుకు చర్యలు ప్రారంభిస్తూ నోటీసులు జారీ చేస్తూ.. షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆర్మూర్ పట్టణంలోని టీఎస్‌ఆర్టీసీ స్థలాన్ని జీవన్‌రెడ్డి సతీమణి రజితరెడ్డి తాను మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న విష్ణుజిత్ ఇన్‌ఫ్ట్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట లీజ్‌కు తీసుకుని మాల్ అండ్ మల్టిప్లెక్స్ పేరిట ఐదు అంతస్తుల భారీ షాపింగ్ మాల్ నిర్మించారు. గత సంవత్సరం దసరా రోజున మాల్ ని ప్రారంభించారు. దీనిలో రిలయన్స్ స్మార్ట్, ట్రెండ్స్, ఎలక్ట్రానిక్స్, కేఎఫ్‌సీ, పీవీఆర్ సినిమా హాళ్లకు అద్దెకు ఇచ్చారు. ఏడాది అవుతున్నా.. అద్దె చెల్లించలేదు.
ఇక ఎన్నికల వరకు కూడా జీవన్‌రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఈ మాల్ అద్దె బకాయిలు వసూలు చేయడంలో ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులు నిర్లక్ష్యం వహించారు. దాంతో ఆర్టీసీకి చెల్లించాల్సిన అద్దె 7 కోట్ల 23 లక్షల 71 వేల 807 రూపాయలు, విద్యుత్‌కు సంబంధించి ట్రాన్స్‌కోకు 2 కోట్ల 57 లక్షల 20 వేల 2 రూపాయలు బకాయిలుగా పేరుకుపోయాయి. ఇప్పుడు రాష్ట్రంలో, నియోజకవర్గంలో అధికార మార్పు జరగగానే ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులు ఈ బకాయిల వసూళ్లకు నడుం బిగించారు. అయితే జీవన్ రెడ్డి మాత్రం ఇంత వరకు ఈ నోటీసులు గురించి స్పందించలేదు.