Tirupathi Rao
Sri Rama Navami 2024- Traffic Restrictions: శ్రీరామనవమి కోసం రెండు తెలుగు రాష్ట్రాలు వైభవంగా ముస్తాబయ్యాయి. పల్లెలు, పట్టణాలు, నగరాల్లో రాములోరి కల్యాణం కోసం గొప్పగా ఏర్పాట్లు చేశారు.
Sri Rama Navami 2024- Traffic Restrictions: శ్రీరామనవమి కోసం రెండు తెలుగు రాష్ట్రాలు వైభవంగా ముస్తాబయ్యాయి. పల్లెలు, పట్టణాలు, నగరాల్లో రాములోరి కల్యాణం కోసం గొప్పగా ఏర్పాట్లు చేశారు.
Tirupathi Rao
సీతా సమేత శ్రీరాముని కల్యాణం కోసం రెండు తెలుగు రాష్ట్రాలు ఎంతో చక్కగా ముస్తాబయ్యాయి. పల్లెలు, ఊర్లలోనే కాకుండా పట్టణాలు, నగరాల్లో కూడా శ్రీరామనవమి శోభ వెల్లివిరుస్తోంది. భద్రాచలం సహా అన్ని రామాలయాలు ఆ సీతారాముల కల్యాణం కోసం శోభాయమానంగా రూపుదిద్దుకున్నాయి. అలాగే హైదరాబాద్ లో శ్రీరామనవమి అంటే కల్యాణం, పానకం, వడపప్పు మాత్రమే కాదు.. ఆ రామయ్య శోభాయాత్ర కూడా ఉంటుంది. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా హైదరాబాద్ మహానగరంలో శ్రీరాముడి శోభాయాత్రను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు.
ఏప్రిల్ 17న శ్రీరామనవమి నేపథ్యంలో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముని శోభాయాత్ర నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలో బుధవారం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. బుధవారం ఉదయం 9 గంటలకు సీతారాంబాగ్ ఆలయం వద్ద ఈ శోభాయాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి కోటిలోని హనుమాన్ వ్యాయామ శాల మైదానానికి చేరుకోవడానికి రాత్రి 11.30 గంటలు అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా శోభాయాత్ర వెళ్లే రూట్లలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అలాగే శోభాయాత్ర రూట్ మ్యాప్ ని కూడా ఇచ్చారు. నగర పౌరులు అసౌకర్యం లేకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని వెల్లడించారు.
సీతారాంబాగ్ ఆలయం వద్ద ప్రారంభమైన శోభాయాత్ర.. రాత్రికి కోటిలోని హనుమాన్ వ్యాయమశాల మైదానంలో ముగుస్తుంది. శోభాయాత్ర రూట్ మ్యాప్ ఇలా ఉంది.. బోయిగూడ కమాన్- జాలి హనుమాన్- మంగళహాట్ పీఎస్ రోడ్- పురాణా పూల్- గాంధీ విగ్రహం- ధూల్పేట్- చుడీ బజార్- బేగం బజార్- జుమ్మేరాత్ బజార్- బేగం బజార్ ఛత్రి- బర్తన్ బజార్- శంకర్ షేర్ హోటల్- గురుద్వారా- సిద్ధి అంబర్ బజార్- గౌలిగూడ చమాన్- పుత్లిబౌలి క్రాస్ రోడ్స్- సుల్తాన్ బజార్- కోఠీ మీదుగా ఈ శ్రీరాముని శోభాయాత్ర జరుగుతుంది.
సీతారాంబాగ్ ఆలయం వద్ద ప్రారంభమైన శోభయాత్రలో దారి పొడవునా చిన్న చిన్న ఊరేగింపులు కూడా వచ్చి చేరతాయి. అలా మార్గం మొత్తం ప్రధాన పాయింట్ల వద్ద ఎన్నో ఊరేగింపులు యాత్రలో చేరతాయి. శోభాయాత్ర పైన చెప్పిన విధంగా ఆయా ప్రాంతాల మీదుగా వెళ్తూ ఉంటుంది. ఆ సమయంలో ఈ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తారు. అయితే యాత్ర చేరుకుంటున్న సమయంలో ఆయా ప్రాంతాల్లో వాహనాలను నిలిపివేస్తారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు మీ గమ్యస్థానానికి చేరుకోవాలి అంటే రేపు మాత్రం శోభాయాత్ర జరిగే ప్రాంతాల వైపు వెళ్లకుండా ఉంటే మంచిది. నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కూడా నగర పౌరులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటే మంచిదని సూచించారు.