iDreamPost
android-app
ios-app

ఓటు వేయడానికి వెళ్తున్నారా? మీ కోసం స్పెషల్ ట్రైన్స్! తక్కువ ధరకే టికెట్స్!

ఏపీలో మే 13న అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఓటర్లు స్వగ్రామాలకు పయనం అయ్యారు. ముఖ్యంగా వివిధ కారణాలతో హైదరాబాద్ నగరంలో ఉంటున్న ఏపీ ఓటర్లు ఊర్లకు వెళుతున్నారు. బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి.

ఏపీలో మే 13న అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఓటర్లు స్వగ్రామాలకు పయనం అయ్యారు. ముఖ్యంగా వివిధ కారణాలతో హైదరాబాద్ నగరంలో ఉంటున్న ఏపీ ఓటర్లు ఊర్లకు వెళుతున్నారు. బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి.

ఓటు వేయడానికి వెళ్తున్నారా? మీ కోసం స్పెషల్ ట్రైన్స్! తక్కువ ధరకే టికెట్స్!

ప్రస్తుతం దేశంలో ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. దేశ వ్యాప్తంగా పలు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సంగతి విదితమే. తెలుగు రాష్ట్రాల్లో కూడా మే 13న లోక్ సభ ఎలక్షన్స్ జరగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇదిలా ఉంటే.. జాబ్, ఎడ్యుకేషన్ పర్పస్ బయట ప్రాంతాలకు వెళ్లిన అనేక మంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తిరిగి స్వగ్రామాలకు పయనం అవుతున్నారు. దీంతో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఎన్ని బస్సు, రైళ్ల సర్వీసులన్న ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి. గంటలు గంటలు బస్టాండ్స్, రైల్వే స్టేషన్లలో పడిగాపులు కాస్తున్నారు జనాలు. ఇది ఏపీలో, తెలంగాణాల్లో ప్రస్తుత పరిస్థితి. ఇదే సమయంలో ప్రైవేట్ బస్సులు, టాక్సీల దందా నడుస్తుంది.

ఒక్కొక్కరి దగ్గర నుండి డబుల్ చార్జీలను వసూలు చేస్తున్నాయి. పిల్లలతో ఊర్లకు పయనం అయిన దంపతులు.. వేచి ఉండలేక వీటిని ఆశ్రయిస్తున్నారు. బస్సు, రైల్వే సర్వీసులు కూడా సరిగ్గా అందుబాటులో లేకపోవడంతో ఇక్కట్లు పడుతున్నారు. దీనికి తోడు ఈ ఎండ తీవ్రతతో మరింత ఇబ్బందికి గురౌతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుండి ఏపీకి వెళ్లే ఓటర్లు. సమ్మర్ కావడంతో రైల్వే.. కొత్త సర్వీసులను తీసుకు వచ్చింది. అయినప్పటికీ.. ఆ సర్వీసులు కూడా చాలడం లేదు. దీంతో రైల్వే స్టేషన్లలో కూడా రద్దీ పెరిగిపోయింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నేపథ్యంలో స్పెషల్ రైళ్లను నడపనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది. సికింద్రాబాద్ నుండి విశాఖ పట్నానికి రెండు సూపర్ ఫాస్ట్ రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించారు అధికారులు.

Going to vote Special trains for you!

ఆదివారం సాయంత్రం 7:45 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలు బయలు దేరనుంది. నంబర్ 07097 ప్రత్యేక రైలు.. మరుసటి తెల్లవారు జామున 6:30 గంటలకు విశాఖపట్నానికి చేరుకుంటుంది. అదే రోజు సాయంత్రం 7:50 నిమిషాలకు విశాఖపట్నం నుంచి బయలుదేరనుంది. నంబర్ 07098 ప్రత్యేక రైలు..విశాఖ నుండి బయలు దేరి, మరుసటి రోజు ఉదయం 8:15 నిమిషాలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ఈ రైళ్లు పగిడిపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, కృష్ణా కెనాల్, విజయవాడ జంక్షన్, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, అన్నవరం, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగనున్నాయి.  మే 13న ఎన్నికలకు వెళ్లి, తిరిగి  హైదరాబాద్ రావాలనుకునే వాళ్లకు బెటర్ ఆప్షన్. సాధారణ టికెట్ రేటుతోనే ప్రయాణించొచ్చు. అలాగే టీఆర్టీసీ కూడా బస్సులనను పెంచే యోచనలో ఉందని తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి