iDreamPost
android-app
ios-app

జనరల్ బోగీల్లో ప్రయాణించే వారికి శుభవార్త! ఇక భయపడాల్సిన పని లేదు!

  • Published Apr 05, 2024 | 6:27 PM Updated Updated Apr 05, 2024 | 6:27 PM

ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసిన డిజిటల్‌ పేమెంట్స్‌ హవా అనేది జోరుగా కొనసాగుతుందనే విషయం అందరికి తెలిసిందే. కానీ, ఒక్క రైల్వే స్టేషన్ లో మాత్రం ఇప్పటి వరకు ఈ సేవలు అనేవి అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలోనే ఇండియన్ రైల్వే తాజాగా ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ అందిందచింది.

ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసిన డిజిటల్‌ పేమెంట్స్‌ హవా అనేది జోరుగా కొనసాగుతుందనే విషయం అందరికి తెలిసిందే. కానీ, ఒక్క రైల్వే స్టేషన్ లో మాత్రం ఇప్పటి వరకు ఈ సేవలు అనేవి అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలోనే ఇండియన్ రైల్వే తాజాగా ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ అందిందచింది.

  • Published Apr 05, 2024 | 6:27 PMUpdated Apr 05, 2024 | 6:27 PM
జనరల్ బోగీల్లో ప్రయాణించే వారికి శుభవార్త! ఇక భయపడాల్సిన పని లేదు!

ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసిన డిజిటల్‌ పేమెంట్స్‌ హవా అనేది జోరుగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే.. చిన్నటీ కొట్టు నుంచి షాపింగ్ మాల్స్ వరకు ఎక్కడ చూసిన ఆన్ లైన్ పేమంట్ ప్రొసెస్ ను అనుసరిస్తున్నారు. అలా క్షణాల్లో డబ్బలును ట్రాన్స్ ఫర్ చేసే అవకాశం రావడంతో…ఇప్పుడునన్న అన్ని రంగాల్లో డిజిటల్ పేమంట్స్ అనేది అవసరంగా మారిపోయింది. ఇక ప్రజలు కూడా ఈ అన్ లైన్ మనీ ట్రాన్స్ ఫర్ కి అలవాటు పడటంతో ఎక్కడికి వెళ్లిన మొదటిగా డిజిటల్ పేమంట్స్ కే ఎక్కువ మగ్గు చూపుతున్నారు. ఇక ప్రతిచోట ఈ డిజిటల్ పేమంట్స్ అనేవి జరుగుతున్నాయి కానీ, ఒక్క రైల్వే స్టేషన్ లో మాత్రం ఇప్పటి వరకు ఈ సేవలు అనేవి అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలోనే ఇండియన్ రైల్వే తాజాగా ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ అందిందచింది. ఇక నుంచి ప్రయాణికులు టికెట్ కౌంటర్ వద్ద ఆ సేవలను పొందవచ్చు.

సాధారణంగా రైల్వే స్టేషన్ కు వెళ్లిన ప్రయాణికులు టీకెట్ కౌంటర్ల దగ్గర పడిన ఇబ్బందులు గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా జనరల్ బుకింగ్ కౌంటర్లలో టికెట్ చేసేందుకు వచ్చిన ప్రయాణికుల రద్దీ కూడా బాగానే ఉంటుంది. ఇక ఆ సమయంలో టికెట్ చేసేందుకు సరిపడా చిల్లర డబ్బులు అందరి దగ్గర లేకపోవడం పెద్ద సమస్యగా మారుతుంది. దీని వలన టికెట్ చేయించే సమయంలో చిల్లర కోసం కొంత సమయం వృథా అవుతుంది. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఇండియన్ రైల్వే తాజాగా ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ ను అందించింది. దక్షిణ మధ్య రైల్వే.. ప్రయాణికులకు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై టికెట్ కౌంటర్ వద్ద ప్రయాణికులు క్యూ ఆర్ కోడ్ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. ఇక ఈ సేవల ద్వారా టికెట్  కౌంటర్ల వద్ద ప్రయాణికుల రద్దీ కూడా తగ్గుతుంది. అలాగే ప్రయాణికులకు చిల్లర సమస్య కూడా ఉండదు.

ఇక డిజిటెల్ సేవల ద్వారా.. జనరల్ బుకింగ్ కౌంటర్లలో ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నిమిషాల్లో వ్యవధిలోనే ట్రైన్ టికెట్ పొందవచ్చు.  ఇలా డిజిటిల్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో.. ఇక మీదట ప్రయాణికులకు సమయానికి టికెట్ అవ్వకపోతే ట్రైన్ మిస్ అయిపోతుందనే భయం కూడా ఉండదు. చక్కగా డిజిటల్ సేవలన ఉపాయోగించి.. క్యూ ఆర్ కోడ్ ద్వారా టిక్కెట్లను పొందవచ్చు. ఇక ఈ డిజిటల్ సేవలనేవి  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో విజయవంతమైతే.. దాదాపు అన్ని నగరాల్లో ఇక నుంచి రైల్వే స్టేషన్ లో డిజిటల్ సేవలను పొందే ఆవకాశం ఉంటుంది.

అయితే ఫస్ట్ ఫేజ్‌లో సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలోని 14 స్టేషన్లలో ఉన్న 31 కౌంటర్లలో.. ఈ డిజిటల్ సేవలు అనేవి అందుబాటులోకి తీసుకొచ్చారు. అనగా.. సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట , వరంగల్ , బేగంపేట మంచిర్యాల, లింగంపల్లి, హైటెక్ సిటీ, జేమ్స్ స్ట్రీట్, మహబూబాబాద్, బెల్లంపల్లి, ఫతేనగర్ బ్రిడ్జ్, సిర్పూర్ కాగజ్ నగర్, వికారాబాద్ రైల్వే స్టేషన్లలో ఈ సేవలు ప్రారంభమయ్యాయి.కాగా, ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే యూ.టి.ఎస్. (జనరల్ బుకింగ్) కౌంటర్లలో మాత్రమే ఈ క్యూఆర్ కోడ్ సదుపాయంతో అన్‌రిజర్వ్ టిక్కెట్లు కొనుగోలు చేసుకునే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. మరి, రైల్వే స్టేషన్ లో కూడా డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.