Vinay Kola
Telangana: తాగొచ్చి కుటుంబాన్ని విసిగిస్తున్నాడని కన్న తండ్రిని హత్యచేశాడు కొడుకు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఉట్ పల్లి ఇంద్రారెడ్డి నగర్ కాలనీలో చోటుచేసుకుంది.
Telangana: తాగొచ్చి కుటుంబాన్ని విసిగిస్తున్నాడని కన్న తండ్రిని హత్యచేశాడు కొడుకు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఉట్ పల్లి ఇంద్రారెడ్డి నగర్ కాలనీలో చోటుచేసుకుంది.
Vinay Kola
మద్యపానం కుటుంబాలను నాశనం చేస్తుంది. మద్యానికి బానిసై మనుషులు దారుణంగా తయారవుతున్నారు. తమ కుటుంబాలను సతాయిస్తున్నారు. మద్యం సేవించి నిత్యం ఇంట్లో రచ్చ రచ్చ చేసేవాళ్ళు పెరిగిపోతున్నారు. తమ కుటుంబీకుల పరువుని బజారుకు ఈడుస్తున్నారు. తాజాగా తాగొచ్చి గొడవ చేస్తూ కుటుంబాన్ని విసిగిస్తున్నాడని కన్న తండ్రిని హత్యచేశాడు కొడుకు. ఈ దారుణమైన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఉట్ పల్లి ఇంద్రారెడ్డి నగర్ కాలనీలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
స్థానికుల వివరాల ప్రకారం.. ఇంద్రారెడ్డి నగర్ కాలనీలో కావలి రాములు కుటుంబం నివాసం ఉంటుంది. అయితే రాములు పచ్చి తాగు బోతు. ఎంతలా అంటే తన కుటుంబాన్ని ఏమాత్రం పట్టించుకోడు. సంపాదిస్తున్న డబ్బంతా కూడా తాగుడికే ఖర్చు పెడతాడు. మద్యానికి విపరీతంగా బానిసయ్యాడు. మద్యం తాగితే తాగాడు కానీ.. తాగిన తరువాత కుదురుగా ఉండడు. నానా రచ్చ చేస్తాడు. నిత్యం మద్యం సేవించి కుటుంబ సభ్యులతో ప్రతి రోజూ గొడవ పెట్టుకుంటాడు. రోజూ కుటుంబ సభ్యులను విసిగించేవాడు. రాములుకి ఇదే ఆగని అలవాటుగా మారింది. పాపం కుటుంబ సభ్యులు రాములుతో విసుగు చెందేవారు. అతనితో నానా అవస్థలు పడేవారు. గత రాత్రి కూడా రాములు మద్యం సేవించి గొడవ పెట్టుకున్నాడు. అది చాలదు అన్నట్లు పక్కనే ఉంటున్న తన చెల్లెలితో గొడవ పడ్డాడు. సొంత చెల్లి అని చూడకుండా రచ్చ చేశాడు. ఆమెపై అసభ్య పదజాలంతో రెచ్చిపోయాడు. ఆగకుండా బూతులు తిట్టడం మొదలు పెట్టాడు. కుటుంబ పరువును వీధిపాలు చేశాడు.
అత్తతో గొడవ పడుతున్న రాములుని కొడుకు శివకుమార్ అడ్డుకున్నాడు. ముందుగా తన తండ్రిని సముదాయించే ప్రయత్నం చేశాడు. కానీ రాములు కొడుకు మాట వినలేదు. మాట వినకపోగా తనపై చేయి చేసుకున్నాడు. తండ్రి కొట్టేసరికి శివకుమార్ కి కోపం వచ్చింది. దాంతో ఇద్దరి మధ్య రచ్చ స్టార్ట్ అయ్యింది. మాటమాట పెరిగి ఆ గొడవ కాస్త తారా స్థాయికి చేరుకుంది. దీంతో తండ్రిపై శివ కుమార్ విసుగు చెందాడు. అతనికి భరించలేని కోపం తన్నుకు వచ్చింది. దాంతో ఆవేశాన్ని అణుచుకోలేక తండ్రి తలపై పక్కనే ఉన్న ఓ బలమైన వస్తువుతో బలంగా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ రాములు అల్లాడిపోయాడు. స్పాట్ లోనే చనిపోయాడు. ఈ దారుణం చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు. చనిపోయి మంచంపై వున్న రాములు మృతదేహాన్ని చూసి ఆరా తీయగా ఈ విషయం తెలిసింది. రాములు డెడ్ బాడీని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరి తాగొచ్చి రచ్చ చేసిన తండ్రిని కొడుకు హత మార్చిన ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.