iDreamPost
android-app
ios-app

వీడియో: రన్నింగ్ ఆర్టీసీ బస్సుపై యువకుల రాళ్ల దాడి!

కుర్రోళ్లు అంటే ఎలా ఉండాలి.. మంచి ప్రవర్తనతో ఇతరులకు అండగా, ఆదర్శంగా ఉండాలి. కానీ రన్నింగ్ ఆర్టీసీ బస్సుపై.. రాళ్లతో దాడి చేశారు. బస్సులో ప్రయాణికులు ఉన్నారన్న సోయి కూడా లేకుండా దారుణంగా ప్రవర్తించారు.

కుర్రోళ్లు అంటే ఎలా ఉండాలి.. మంచి ప్రవర్తనతో ఇతరులకు అండగా, ఆదర్శంగా ఉండాలి. కానీ రన్నింగ్ ఆర్టీసీ బస్సుపై.. రాళ్లతో దాడి చేశారు. బస్సులో ప్రయాణికులు ఉన్నారన్న సోయి కూడా లేకుండా దారుణంగా ప్రవర్తించారు.

వీడియో: రన్నింగ్ ఆర్టీసీ బస్సుపై యువకుల రాళ్ల దాడి!

యువత అంటే సమాజానికి ఆస్తిలాంటి వారు.  కారణం.. కుర్రాళ్ల తమ శక్తిని మంచి వైపు వినియోగిస్తే..రాష్ట్రం,  దేశం అభివృద్ధి పథంవైపు పరుగులు పెడుతుంది. ఏ దేశమైన అభివృద్ధి చెందడానికి ఉండే ప్రధాన కారణాల్లో కూడా యువత నైపుణ్య వినియోగం ఒకటి. అలాంటి పౌరుల్లో కొందరు చెడు మార్గంలో పయనిస్తున్నారు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ పబ్లిక్ ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాము సమాజంలో ఉన్నామని కనీస జ్ఞానం మర్చి..పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కొందరు కుర్రాళ్లు రన్నింగ్ ఆర్టీసీపై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

కుర్రోళ్లు అంటే ఎలా ఉండాలి.. మంచి ప్రవర్తనతో ఇతరులకు అండగా, ఆదర్శంగా ఉండాలి. కానీ రన్నింగ్ ఆర్టీసీ బస్సుపై.. రాళ్లతో దాడి చేశారు. బస్సులో ప్రయాణికులు ఉన్నారన్న సోయి కూడా లేదు. హైదరాబాద్‌ శివారులోని రాచలూరు గేట్‌ వద్ద కల్వకుర్తి డిపోకు చెందిన బస్సుపై గురువారం తెల్లవారుజామున దాడి జరిగింది. ఈ రన్నింగ్ లో ఉన్న ఈ బస్సుపై రాచలూరు గేట్ వద్దకు రాగానే కొందరు దుండగులు ద్విచక్ర వాహనాలపై వచ్చి దాడి చేశారు. బస్సు అద్దాలపై రాళ్లు వేస్తూ నానా హంగామా సృష్టించారు.

అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ  బస్సులోని వారందరూ ఎటువంటి గాయాలు కాకుండా క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనపై వీడియో తీసిన కొందరు ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు పంపారు. దీంతో ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్  సోషల్ మీడియా వేదికగా స్పందించారు.  ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలను నిత్యం సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న తమ బస్సులపై ఎలాంటి కారణం లేకుండా దాడులు చేయడాన్ని ఏమాత్రం సహించమని తెలిపారు.

ఆర్టీసీ బస్సుపై దాడిని సీరియస్ గా తీసుకున్నామని తెలిపారు. అలానే ఈ ఘటనపై మహేశ్వరం పోలీస్‌ స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తునూ ప్రారంభించారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తిని, వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలదేని సజ్జనార్ తెలిపారు. పోలీస్ శాఖ సహకారంతో నిందితులపై హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామని, జరిగిన నష్టాన్ని నిందితుల నుంచే వసూలు చేయడం జరుగుతుందని సజ్జనార్ ట్వీట్ లో తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి