Solar Power Must For Indiramma Illu Telangana: అలర్ట్‌.. ఇందిరమ్మ ఇళ్లు కావాలంటే.. అది తప్పనిసరి.. లేదంటే!

Indiramma Houses: అలర్ట్‌.. ఇందిరమ్మ ఇళ్లు కావాలంటే.. అది తప్పనిసరి.. లేదంటే!

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం కీలక అలర్ట్‌ జారీ చేసింది. ఇందిరమ్మ ఇల్లు కావాలంటే.. అది తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. ఆ వివరాలు..

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం కీలక అలర్ట్‌ జారీ చేసింది. ఇందిరమ్మ ఇల్లు కావాలంటే.. అది తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. ఆ వివరాలు..

సామాన్యులు మొదలు ధనవంతుల వరకు ప్రతి ఒక్కరికి ఉండే అతి ముఖ్యమైన, సర్వసాధారమైన కోరిక సొంతిల్లు. సొంతింటిలో కన్ను మూయాలని చాలా మంది కోరుకుంటారు. ఇక ఇల్లు కట్టడం ఆర్థికంగా ఎంత కష్టమైన పనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సింపుల్‌గా గ్రామాల్లో ఇల్లు నిర్మించాలన్నా ఎంత లేదన్నా 10-20 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇక మోస్తరు పట్టణాలు, నగరాల్లో ఇంటి నిర్మాణం అంటే అరకోటి నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేయాలి. ఇంటి నిర్మాణం మోయలేని భారంగా మారడంతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పేదవాడి సొంతింటి కలను నెవవేర్చడం కోసం హౌసింగ్‌ స్కీమ్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. కేంద్రంలో పీఎం ఆవాస్‌ యోజన పథకం అమల్లో ఉండగా.. రాష్ట్రాల్లో ప్రత్యేకంగా హౌసింగ్‌ స్కీమ్స్‌ ఉన్నాయి.

ఇక తెలంగాణలో సొంతిల్లు లేని పేదలకు ఇండ్లు నిర్మిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ దాని అమలులో మాత్రం ఆశించన మేర విజయం సాధించలేదు. దీన్ని అవకాశంగా మలుచుకున్న కాంగ్రెస్‌ పార్టీ.. తాము అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద.. ఇల్లు లేని ప్రతి పేదవారికి సొంతింటి నిర్మాణానికి సాయం చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆరు గ్యారంటీల్లో భాగంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

దీనికోసం ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకువచ్చారు. దీనిలో భాగంగా సొంత జాగా ఉన్న పేదల ఇండ్ల నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. జాగా లేని వారికి స్థలంతో పాటు డబ్బులు కూడా మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కీలక అలర్ట్‌ జారీ చేశారు.  వాటిని పాటిస్తేనే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్లకు సోలార్ పవర్ తప్పనిసరి కానుంది. అయితే ఇది రాష్ట్రవ్యాప్తంగా కాదు. హైదరాబాద్ శివారు ఔటర్ రింగు రోడ్డుతో పాటు కొత్తగా నిర్మించనున్న రీజినల్ రింగు రోడ్డు మధ్య నిర్మించే ఇండ్లకు సోలార్ పవర్‌ తప్పనిసరి చేయనున్నట్లు తెలిసింది. ఈ ప్రాంతాల్లో ఇండ్లు నిర్మించుకోవాలంటే సోలార్ పవర్ తప్పనిసరిగా పెట్టుకోవాల్సిందే. దీన్ని అమలు చేసేందుకు ఇప్పటికే సోలార్ పవర్ వినియోగిస్తున్న చైన్నై, బెంగళూరు, ముంబైల్లోని పేదల ఇండ్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు అధికారులు పరిశీలించనున్నట్లు తెలిసింది.

ఇక ఈ ఏడాది ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇళ్లను నిర్మించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణలోని మెుత్తం 119 నియోజకవర్గాలకు గానూ.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 3500 ఇండ్లు నిర్మిస్తామని తెలిపారు. ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయగా.. బడ్జెట్ సమావేశాల తర్వాత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ జరగనున్నట్లు సమాచారం.

Show comments