iDreamPost
android-app
ios-app

గచ్చిబౌలిలో కంపెనీ భారీ మోసం.. 5 కోట్లు మోసపోయిన నిరుద్యోగులు

  • Published Jun 19, 2024 | 10:10 PMUpdated Jun 19, 2024 | 10:10 PM

Software Comnay Cheating: గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్ వేర్ కంపెనీ చేసిన పనికి నిరుద్యోగులు 5 కోట్ల రూపాయలు నష్టపోయారు.

Software Comnay Cheating: గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్ వేర్ కంపెనీ చేసిన పనికి నిరుద్యోగులు 5 కోట్ల రూపాయలు నష్టపోయారు.

  • Published Jun 19, 2024 | 10:10 PMUpdated Jun 19, 2024 | 10:10 PM
గచ్చిబౌలిలో కంపెనీ భారీ మోసం.. 5 కోట్లు మోసపోయిన నిరుద్యోగులు

సాఫ్ట్ వేర్ జాబ్ చేయాలనేది ఎంతోమంది కల. దాని కోసం కొంతమంది లక్షలు చెల్లించి బ్యాక్ డోర్ లో జాబ్ తెచ్చుకుంటారు. కొంతమంది ఫేక్ పెట్టి జాబ్ తెచ్చుకుంటారు. కొంతమంది ప్రాక్సీ చేసి జాబ్ తెచ్చుకుంటారు. ఉద్యోగం కావాలనుకునే వ్యక్తి ఆన్ లైన్ ఇంటర్వ్యూలో మాట్లాడకుండా నోరు మెదుపుతా ఉంటే వేరే వ్యక్తి సమాధానం ఇస్తుంటాడు. ఆ వాయిస్ తో వీడియో కాల్ లో ఇంటర్వ్యూ ఫేస్ చేసే వ్యక్తి మేనేజ్ చేస్తుంటాడు. ఉద్యోగం వచ్చాక ప్రాజెక్ట్స్ ని ఇంటర్వ్యూ సమయంలో సహాయం చేసిన వ్యక్తి పూర్తి చేస్తాడు. అందుకోసం ఈ కొత్త ఉద్యోగి పాత ఉద్యోగికి జీతంలో కొంత వాటా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేసి దొరికిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా సాఫ్ట్ వేర్ జాబుల కోసం ఆరాటపడేవాళ్లు చాలా మంది ఉన్నారు.

కొంతమంది మాత్రం కన్సల్టెన్సీ కంపెనీల ద్వారా సాఫ్ట్ వేర్ జాబ్ తెచ్చుకోవాలని చూస్తారు. అందుకోసం కన్సల్టెన్సీ కంపెనీలకు కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని కంపెనీలు మొదటి జీతాన్ని కమిషన్ గా తీసుకుంటాయి. కొన్ని కంపెనీలు రిజిస్ట్రేషన్ ఫీజుల పేరిట ముందుగానే వేలు, లక్షలు వసూలు చేస్తాయి. తాజాగా ఓ కన్సల్టెన్సీ కమ్ సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి 800 మందిని నిండా ముంచేసింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ కంపెనీ నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బు వసూలు చేసింది. టార్గెట్ రీచ్ అయ్యాక బోర్డు తిప్పేసింది. ఓ కంపెనీ ‘రైల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో దేశవ్యాప్తంగా ఐదు బ్రాంచ్ లు ఓపెన్ చేసింది.

వాటిలో ఒక బ్రాంచిని గచ్చిబౌలిలో పెట్టింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించడమే పనిగా పెట్టుకుంది. నమ్మించి నిరుద్యోగుల నుంచి సెక్యూరిటీ డిపాజిట్ కింద భారీగా వసూలు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 800 మంది నిరుద్యోగుల నుంచి ఐదు బ్రాంచీల ద్వారా సుమారు 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఒక్కొక్కరి దగ్గర రూ. 40 వేల నుంచి రూ. 50 వేలు వసూలు చేసింది. ఒక్క గచ్చిబౌలిలోనే 40 లక్షల రూపాయలు వసూలు చేసింది. 5 కోట్ల రూపాయల టార్గెట్ రీచ్ అవ్వగానే కంపెనీ చేతులెత్తేసింది. దీంతో వందల మంది రోడ్డున పడ్డారు. బాధితులు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి