iDreamPost
android-app
ios-app

సిరిసిల్లలో ‘సింగం’ సినిమా రిపీట్.. ఇంటర్నేషనల్‌ సైబర్ రాకెట్‌ గుట్టు రట్టు!

  • Published Apr 27, 2024 | 8:25 PM Updated Updated Apr 27, 2024 | 8:25 PM

కోలీవుడ్ హీరో సూర్య నటించిన సింగం సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఆ సినిమాలో పోలీసులు నిందితుల కోసం ఎలా అయితే విదేశాలకు వెళ్తారో.. అచ్చం అలానే సిరిసిల్ల జిల్లా పోలీసులు కూడా ఓ నిందితుడుని పట్టుకొనేందుకు వెళ్లిన పోలీసులకు అక్కడ మరో ట్విస్ట్ అనేది వెలుగులోకి వచ్చింది.

కోలీవుడ్ హీరో సూర్య నటించిన సింగం సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఆ సినిమాలో పోలీసులు నిందితుల కోసం ఎలా అయితే విదేశాలకు వెళ్తారో.. అచ్చం అలానే సిరిసిల్ల జిల్లా పోలీసులు కూడా ఓ నిందితుడుని పట్టుకొనేందుకు వెళ్లిన పోలీసులకు అక్కడ మరో ట్విస్ట్ అనేది వెలుగులోకి వచ్చింది.

  • Published Apr 27, 2024 | 8:25 PMUpdated Apr 27, 2024 | 8:25 PM
సిరిసిల్లలో  ‘సింగం’ సినిమా రిపీట్.. ఇంటర్నేషనల్‌ సైబర్ రాకెట్‌ గుట్టు రట్టు!

కోలీవుడ్ హీరో సూర్య నటించిన సింగం సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. కాగా, ఆ సినిమాలోని ఓ కేసులో ఉన్న నిందితుడు తప్పించుకోవడానికి విదేశాలకు పరారవుతాడు. ఇక ఆ నిందితుడిని వెతికే పనిలో హీరో అండ్ టీమ్ అంతా.. విదేశాలకు వెళ్లి అక్కడ నిందితుడిని అరెస్ట్ చేయాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే నిందితుడిని అరెస్ట్ చేయడానికి విదేశాలకు వెళ్లి అక్కడ పోలీసులు సహాయంతో నిందితుడిని అరెస్ట్ చేసి ఇండియాకు లాక్కొస్తాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా స్టోరి అంతా ఎందుకు అని అనుకుంటున్నారు.. ఎందుకంటే అచ్చం ఇలాంటి సీన్ నే రిపీట్ అయిన కేసునే సిరిసిల్ల పోలీసులు చేధించారు. అచ్చం సినిమాలో మాదిరిగానే.. ఓ నిందితుడిని పట్టుకొనేందుకు వెళ్లిన పోలీసులకు అక్కడ మరో ట్విస్ట్ అనేది వెలుగులోకి వచ్చింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

అచ్చం సినిమాల్లో జరిగిన సన్నివేశం మాదిరిగానే తాజాగా సిరిసిల్ల పోలీసులు రిపీట్  చేశారు. కాగా, జిల్లాకు చెందిన ఓ బాధితుని తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో ఇంటర్నేషనల్ లెవల్‌లో అతిపెద్ద సైబర్ ముఠా గుట్టు రట్టు చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే.. కంబోడియా దేశంలో ఓ చైనీస్ కంపెనీ ద్వారా సైబర్ మోసాలు చేపిస్తున్న ముఠాను సిరిసిల్ల పోలీసులు బయటపెట్టారు. కాగా, కండోబియాలోని ఇండియన్ ఎంబసీ ద్వారా అక్కడి స్థానిక పోలీసుల సహాయంతో సోదాలు నిర్వహించి.. ఆ కూపంలో ఇరుక్కుపోయిన బాధితుడిని కాపాడి స్వదేశానికి తీసుకొస్తున్నారు. అసలు విషయానికొస్తే.. సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయానికి నాలుగు రోజుల క్రితం పెద్దూర్ గ్రామానికి చెందిన అతికం లక్ష్మీ అనే మహిళ వచ్చి ఫిర్యాదు ఇచ్చింది.  కాగా, జగిత్యాల జిల్లా కోడిమ్యాలకు చెందిన కంచర్ల సాయి ప్రసాద్ అనే ఏజెంట్‌కి లక్షా 40 వేలు ఇచ్చి తన కుమారుడు శివ ప్రసాద్ కంబోడియా దేశానికి వెళ్లాడని వివరించింది. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత అతన్ని పాస్ పోర్టు లాగేసుకుని, మళ్లీ తిరిగి ఇండియాకు రాకుండా చేసి.. సైబర్ మోసాలు చేయిపిస్తున్నరంటూ పోలీసులకు ఆ మహిళ తన గోడును వెళ్లడించింది.

కాగా,  శివ ప్రసాద్ మొబైల్ నెంబర్ తీసుకొని వాట్సప్ ద్వారా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడగా.. అక్కడ చైనీస్‌కి చెందిన కంపెనీలో శివప్రసాద్ పాస్‌పోస్ట్ తీసేసుకుని సైబర్ నేరాలు చేపిస్తున్నారని, అలాగే తనాలా ఇండియాకు చెందిన  500 నుంచి 600 మంది బాధితులు ఉన్నారని తెలిపాడు. అయితే  వాళ్లందరితో కాల్ సెంటర్‌లా ఏర్పాటు చేసి ఇండియన్ ఫోన్ నెంబర్స్ ఇచ్చి లాటరీ ఫ్రాడ్స్, జాబ్ ఫ్రాడ్స్, టాస్కులు ఇచ్చి వాటిని పూర్తి చేస్తే అధికమొత్తంలో డబ్బులు వస్తాయని సైబర్ మోసాలు చేయిస్తున్నారని వివరించారు. దీంతో.. వెంటనే సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి.. కంబోడియాలో ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి బాధితుని వివరాలు షేర్ చేశామని, అలాగే అక్కడి లోకల్ పోలీస్‌ల సహాయంతో.. ఆ ఆఫీసుపై దాడులు జరపగా, అసలు విషయం బయటపడిందని పోలీసులు తెలిపారు. దీంతో ఆ సైబర్ ముఠాలో ఇరుక్కుపోయిన శివప్రసాద్‌ను కాపాడామని.. ఇక  2 రోజుల్లో అతడు ఇండియాకు చేరుకుంటారని తెలిపారు. అదేవిధంగా అక్కడ ఉన్న బాధితులని కాపాడి త్వరలోనే ఇండియాకి తీసుకొస్తామని చెప్పుకొచ్చారు.

అలాగే శివప్రసాద్‌ను కంబోడియాకు పంపించిన ఏజెంట్.. జగిత్యాల జిల్లాకు చెందిన కంచర్ల సాయిప్రసాద్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. కాగా, అతడు 10,000 రూపాయలు కమిషన్ తీసుకొని మిగతా డబ్బులను లక్నోకు చెందిన సదాకత్ అనే వ్యక్తికి పంపుతున్నాడని, ప్రస్తుతం అతడు మాల్దీవ్స్‌లో ఉంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే ఈ కేసును సైబర్ సెక్యూరి సహాయంతో ఛేదిస్తామన్నారు. ఇక ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లే యువకులు.. కేవలం లైసెన్స్ కలిగి ఉన్న ఏజెన్సీల మాత్రమే ఆశ్రయించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. అలాగే జిల్లాలో ఎవరైతే ఏజెన్సీల ద్వారా గానీ, ఏజెంట్ల చేతిలో మోసపోయారో వారి కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్‌‌ ఫోన్ నెంబర్ 8712656411కు నేరుగా ఫోన్ చేసి.. ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. మరి, సినిమాను తలపించిన ఈ కేసు పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.