iDreamPost

తీవ్ర విషాదం.. గుండెపోటుతో కాలేజీలోనే కుప్పకూలిన బీటెక్‌ స్టూడెంట్‌

  • Published Nov 17, 2023 | 10:38 AMUpdated Nov 17, 2023 | 10:38 AM

ఈమధ్య కాలంలో గుండెపోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. చిన్నారులు, యువత కూడా హార్ట్‌ ఎటాక్‌ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇక తాజాగా మరో యువతి గుండెపోటుతో కన్నుమూసింది. ఆ వివరాలు..

ఈమధ్య కాలంలో గుండెపోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. చిన్నారులు, యువత కూడా హార్ట్‌ ఎటాక్‌ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇక తాజాగా మరో యువతి గుండెపోటుతో కన్నుమూసింది. ఆ వివరాలు..

  • Published Nov 17, 2023 | 10:38 AMUpdated Nov 17, 2023 | 10:38 AM
తీవ్ర విషాదం.. గుండెపోటుతో కాలేజీలోనే కుప్పకూలిన బీటెక్‌ స్టూడెంట్‌

గత కొంతకాలంగా తరచుగా వినిపిస్తోన్న మాట గుండెపోటు.. కార్డియాక్‌ అరెస్ట్‌. చిన్నాపెద్దా తేడా లేకుండా.. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో కుప్పకూలుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా కనిపించిన వారు.. ఉన్నట్లుండి కుప్పకూలుతున్నారు. ఎంతో సంతోషంగా సాగిపోతున్న వారి జీవితం.. సెకన్ల వ్యవధిలో ముగిసిపోతుంది. అసలు ఒకప్పుడు గుండెపోటు అంటే కేవలం వయసు మళ్లిన వారికి, అధిక బరువుతో బాధ పడుతున్న వారికి వచ్చే అనారోగ్య సమస్యగా భావించేవారు.

అయితే మారుతున్న ఆహారపు అలవాటు, జీవనశైలి కారణంగా నేటి కాలంలో పదేళ్ల చిన్నారులు మొదలు పాతికేళ్ల యువతీయువకులు కూడా గుండె పోటు బారిన పడుతున్నారు. వ్యాయామం చేస్తే ఎంతో మంచిది అంటారు. కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్య కాలంలో చాలా మంది జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ.. ఆటలు ఆడుతుండగా గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. ఇక తాజాగా బీటెక్‌ చదువుతోన్న ఓ యువతి కాలేజీ ప్రాంగణంలోనే గుండెపోటుతో మృతి చెందింది. ఆ వివరాలు..

ఈ విషాదకర సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. బీటెక్‌ విద్యార్థిని ఒకరు కాలేజ్‌ ప్రాంగణంలోనే గుండెపోటు బారిన పడి మృతి చెందింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సిరిసిల్లకు చెందిన ప్రదీప్తి(18) నగరంలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం అనగా నవంబర్‌ 14న ప్రదీప్తికి గుండెపోటు వచ్చింది. హార్ట్‌ ఎటాక్‌తో కాలేజీలోనే కుప్పకూలింది. ఇది గమనించిన తోటి విద్యార్థులు ఆమెను వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది.

ప్రదీప్తి మరణంతో ఆమె తల్లిదండ్రులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మృతదేహాన్ని అంబులెన్స్‌లో సిరిసిల్లలోని స్వగృహానికి తరలించారు. చిన్న వయసులోనే ప్రదీప్తి గుండెపోటుతో మరణించడం సిరిసిల్లలో విషాదం నింపింది. ప్రదీప్తి తల్లిదండ్రులు కుమార్తె మరణాన్ని తలచుకుని గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఎంతో ఆరోగ్యంగా ఉన్న బిడ్డ ఇలా ఉన్నట్లుండి మృత్యువాత పడటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

ప్రస్తుతం కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు గుండెపోటుకు కారణంగా చెబుతున్నారు వైద్య నిపుణలు. నేటి కాలంలో శారీరక శ్రమ తగ్గింది.. ఎక్కువ గంటలు కదలకండా కూర్చిన చేసే పనులు పెరగడం వంటి పరిస్థితులు గుండె జబ్బులకు దారీ తీస్తున్నాయంటున్నారు. ఆహారపు అలవాట్లు మార్చి.. శరీరక శ్రమ, యోగా వంటి చేయటం ద్వారా గుండె జబ్బుల బారి నుంచి తప్పించుకోవచ్చునని సూచిస్తున్నారు. అయితే వ్యాయమాలు చేయమన్నారు కదా అని చెప్పి.. మన శక్తికి మించిన వాటిని చేసినా.. ప్రాణాలకు ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి