తెలంగాణలో మరో ఎన్నికలకు మోగిన సైరన్!

Singareni Recognition: ఆదివారం ఫలితాలతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. కాంగ్రెస్ విజేతగా నిలవగా.. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షానికి పరితమైంది. ఈ ఎన్నికల వేడి చల్లారక ముందే తెలంగాణలో మరో ఎన్నికలకు సైరన్ మోగింది.

Singareni Recognition: ఆదివారం ఫలితాలతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. కాంగ్రెస్ విజేతగా నిలవగా.. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షానికి పరితమైంది. ఈ ఎన్నికల వేడి చల్లారక ముందే తెలంగాణలో మరో ఎన్నికలకు సైరన్ మోగింది.

ఆదివారం వెలువడిన ఫలితాలతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక సమరానికి తెరబడింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అదే విధంగా రెండు సార్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ కు మూడో సారి మాత్రం బ్రేక్ పడింది. కేవలం 39 స్థానాలతోనే బీఆర్ఎస్ సరిపెట్టుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేడీ దాదాపు రెండు నెలల పాటు  కొనసాగింది. అభ్యర్థుల ఎంపిక నుంచి, నామినేషన్లు, ప్రచారం, ఫలితాలు అంటూ రెండు నెలల పాటు ఓ రేంజ్ లో ఎన్నిక వేడి కొనసాగుంది. ఫలితాలు వెలువడి రెండు రోజులు గడవ ముందే తెలంగాణలో మరో ఎన్నికల సైరన్ మోగింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

తెలంగాణలోని సింగరేణిలో డిసెంబర్ 27న కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రెండు రోజులు గడవక ముందే సింగరేణిలో ఎన్నికల నిర్వహణకు  మూహురుతం ఖారారైంది. సింగరేణిలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలకు సంబంధించి రెండు నెలల కంటే ముందే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసి.. నామినేషన్‌ ప్రక్రియ చేపట్టారు. అయితే అదే సమయంలో తెలంగాణ శాసన సభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. దీంతో సింగరేణి ఎన్నికలకు బ్రేక్ పడింది. వాటిని నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో శాసన సభ ఎన్నికల తర్వాత నిర్వహించాలని నిర్ణయించారు. ఈక్రమంలోనే ఆదివారం విడుదలైన ఫలితాలతో తెలంగాణ ఎన్నిక ఘట్టం ముగిసింది.

ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌, సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ సంఘాలకు చెందిన నాయకులు సింగరేణి అధికారులు పాల్గొన్నారు. సింగరేణి ఎలక్షన్లకు సంబంధించి ఏకాభిప్రాయానికి రావడంతో డిసెంబర్ 27న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో సింగరేణి వ్యాప్తంగా ఉన్న కార్మికుల ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారి, కార్మిక సంఘాల నాయకులు అందించారు. ఇక ఈ ఎన్నిక విషయానికి వస్తే.. చివరగా 2017 సెప్టెంబర్ 5న జరిగాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ  సంఘాలు ఘన విజయం సాధించాయి.

మొత్తం 11 ఏరియాలకు గాను 9 తొమ్మిది ప్రాంతాలను బీఆర్ఎస్ అనుబంధ సంఘాలు గెల్చుకున్నాయి. ఆదిలాబాద్‌, సిర్పూర్ కాగజ్ నగర్, పెద్దపల్లి, కరీంనగర్‌, వరంగల్‌, ములుగు, ఖమ్మం జిల్లాల పరిధి కార్మిక క్షేత్రాల్లోని 12 నియోజకవర్గాలతో పాటు మరికొన్ని సింగరేణి ఎన్నికల ప్రభావం ఉంటుంది. మొత్తాని అసెంబ్లీ ఎన్నిక వేడి తగ్గక ముందే తెలంగాణలో మరో ఎన్నికలకు సైరన్ మోగింది. మరి.. సింగరేణి ఎన్నికల విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments