iDreamPost
android-app
ios-app

సింగరేణి ఉద్యోగులకు భారీ శుభవార్త.. ఒక్కొక్కరి అకౌంట్లోకి 4 లక్షలు..

  • Published Sep 13, 2023 | 10:28 AMUpdated Sep 13, 2023 | 10:28 AM
  • Published Sep 13, 2023 | 10:28 AMUpdated Sep 13, 2023 | 10:28 AM
సింగరేణి ఉద్యోగులకు భారీ శుభవార్త.. ఒక్కొక్కరి అకౌంట్లోకి 4 లక్షలు..

సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ శుభవార్త చెప్పింది. గత కొన్నాళ్లుగా ఉద్యోగులకు, కార్మికులకు బకాయి ఉన్న ఏరియర్స్‌ అన్ని ఒకేసారి చెల్లించేలా సింగరేణి యాజమాన్యం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 21వ తారీఖునే ఉద్యోగులందరి అకౌంట్లలో ఈ ఏరియర్స్ మొత్తాన్ని వేయనున్నట్టు సింగరేణి యాజమాన్యం పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల ఒక్కో సింగరేణి కార్మికుడి ఖాతాలో ఒకేసారి 4 లక్షల రూపాయల మేర డిపాజిట్‌ అయ్యే చాన్స్‌ ఉంది అంటున్నారు.

ఈ నిర్ణయం వల్ల దాదాపు 40 వేల ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. కార్మికులకు చెల్లించాల్సిన 11వ వేతన ఒప్పందం 23 నెలల పెండింగ్ బకాయిలు రూ.1726 కోట్లను విడుదల చేయనున్నారు. సింగరేణి చరిత్రలో తొలిసారిగా ఇంత పెద్దమొత్తంలో వేతన బకాయిలను చెల్లిస్తున్నట్టు ఆ సంస్థ యాజమాన్యం చెప్తొంది. ఈ నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

సీఎం కేసీఆర్, టీజీబీకేఎస్‌ అధ్యక్షురాలు కవిత ప్రత్యేక చొరవతో కార్మికులకు ఒకేసారి భారీ మొత్తంలో ఏరియర్స్ బకాయిలు అందనున్నాయి. 23 నెలల ఏరియర్స్ చెల్లింపుల్లో ఈ మొత్తం కాలానికి సంబంధించిన పీఎఫ్ షేర్, ఇన్‌కమ్‌ టాక్స్ బకాయిలు కట్ చేసుకుని.. మిగతా డబ్బులను కార్మికులకు చెల్లించనున్నారు. అయితే.. ఒకేసారి ఇంత పెద్దమొత్తంలో ఏరియర్స్‌ విడుదల చేయడంపై ఉద్యోగులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా..త్వరలోనే ఆదిలాబాద్‌ సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌‌లో గుర్తింపు పొందిన కార్మిక సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 28న ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధింఇ.. అక్టోబరు 7న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 10వ తారీఖున కార్మిక సంఘాలకు గుర్తులు కేటాయించనున్నారు. అయితే.. ఈ ఎన్నికలకు గానూ.. సెప్టెంబర్ 22న షెడ్యూల్‌ విడుదల కానుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి