తెలంగాణలో బీర్ల కొరత.. ఎక్సైజ్ అధికారులు ఏమన్నారంటే?

ఎండాకాలంలో మందుబాబులు ఎక్కువగా చల్ల చల్లని బీర్లు లాగించేస్తుంటారు. పార్టీలు.. శుభకార్యాలు ఏవైనా సరే చిల్డ్ బీర్ లేకుంటే మజాయే ఉండదంటారు.

ఎండాకాలంలో మందుబాబులు ఎక్కువగా చల్ల చల్లని బీర్లు లాగించేస్తుంటారు. పార్టీలు.. శుభకార్యాలు ఏవైనా సరే చిల్డ్ బీర్ లేకుంటే మజాయే ఉండదంటారు.

వేసవి కాలంలో మందు బాబులు చిల్ కావడానికి ఎక్కువగా బీర్లు తాగుతుంటారు. ఎండాకాలంలో చల్లని బీర్లు లాగించేస్తుంటే.. ఆ మజాయే వేరు అంటారు. తెలంగాణలో ఈ ఏడాది బీర్ల కొరత తీవ్రంగా ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కొన్ని వైన్స్ షాపుల్లో బీర్లు లేవు అంటూ బోర్డులే పెడుతున్నారు. కొంతమంది బీర్లు కొరత ఉందని చూపించి బ్లాక్ లో అమ్ముకుంటూ డబ్బులు లాగుతున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా తెలంగాణలో బీర్ల కొరతపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా చర్చించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ విషయంపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కమిషనర్ క్లారిటీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..

ఎండాకాలంలో చల్ల చల్లని బీరు తాగుతుంటే ఆ మాజాయే వేరు అంటుంటారు మందుబాబులు. ఈ ఏడాది తెలంగాణలో బీర్ల కొరత మరీ ఎక్కువగా ఉందని అంటున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గత కొన్నిరోజులుగా బీర్ల కొరత తీవ్రంగా ఉంది. కొన్ని వైన్స్ షాపుల్లో అయితే నో స్టాక్ అనే బోర్డులు కూడా దర్శనమిస్తున్నాయి. అయితే కొంతమంది దళారులు బీర్లు కొరత సృష్టించి బ్లాక్ లో అమ్ముకుంటూ అడ్డగోలిగా డబ్బులు సంపాదిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కమీషనర్ శ్రీధర్ క్లారిటీ ఇచ్చారు. మూడో షిఫ్ట్ కు అనుమతించకపోవడంతోనే షార్టేజ్ వచ్చిందని ఈ వార్తల్లో అసలు నిజం లేదని కొట్టిపడేశారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు బీర్ల తయారీ కంపెనీలు ఉన్నాయి. అయితే లైసెన్స్ కండీషన్స్ ప్రకారం బీర్ల ప్రొడక్షన్ చేయడాకి అనుమతి ఉంటుంది. ఒక షిఫ్ట్ కి పర్మిషన్ ఉంటుంది.. డిమాండ్ మేరకు ఫీజు చెల్లించిన వారికి మూడు షిఫ్టులకు అనుమతి ఇస్తాం. అయితే ఆరు బీర్ల కంపెనీల్లో నాలుగు బీర్ల కంపెనీ తమకు డిమాండ్ ఉన్న బ్రాండ్స్ ఎక్కువ భాగం సప్లై చేస్తున్నాయి. ఈ నాలుగు సంస్థలు మూడు షిఫ్టులకు పర్మిషన్ తీసుకున్నాయి.. ప్రస్తుతం కింగ్ ఫిషర్ బ్రాండ్ కొరత తప్ప మిగిలిన అన్ని బ్రాండ్ లు అందుబాటులో ఉంటున్నాయని అన్నారు. గత ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో 360 కొత్త మద్యం బ్యాండ్లకు అనుమతి ఇవ్వగా.. నాలుగు బీరు బ్రాండ్స్ ను సరఫరా చేసుందుకు కార్పోరేషన్ వద్ద రిజిస్ట్రే

Show comments