P Venkatesh
సంవత్సరం క్రితమే ప్రేమ వివాహం చేసుకుంది. కొంతకాలం వరకు సంతోషంగా సాగింది వీరి కాపురం. కానీ ఆ కారణంతో యువతి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అసలు ఏం జరిగిందంటే?
సంవత్సరం క్రితమే ప్రేమ వివాహం చేసుకుంది. కొంతకాలం వరకు సంతోషంగా సాగింది వీరి కాపురం. కానీ ఆ కారణంతో యువతి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అసలు ఏం జరిగిందంటే?
P Venkatesh
ఇటీవల ప్రేమ పేరుతో జరిగే మోసాలు అన్నీ ఇన్నీకావు. ప్రేమ పేరుతో లోబర్చుకుని మోసాలకు పాల్పడతున్నారు. ప్రేమించిన అమ్మాయి దక్కదేమోనన్న అక్కసుతో దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు వ్యక్తులు. ప్రేమకు ఒప్పుకోకపోయినా లేదా పెళ్లికి నిరాకరించినా కూడా ప్రాణాలు సైతం తీసేందుకు వెనకాడడం లేదు. నిత్యం దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు మహిళల రక్షణ కోసం కఠినమైన చట్టాలను తీసుకొచ్చి అమలు చేస్తున్నప్పటికీ ఘోరాలను అరికట్టలేకపోతున్నారు. ఈ క్రమంలో ఓ యువతి అత్తింటి వేధింపులు తాళలేక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకుని అంతలోనే మృత్యుఒడిలోకి చేరకుంది.
ముందుగా ప్రేమిస్తున్నానని వెంటపడడం ఆ తర్వాత పెళ్లి చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. వివాహం చేసుకున్న కొద్ది రోజులకే తమ వక్రబుద్దిని బయటపెడుతున్నారు. ఇటీవల వరకట్న వేధింపులు ఎక్కువై పోతున్నాయి. అమాయకపు మహిళలు అదనపు కట్నం వేధింపులు బలిగొంటున్నాయి. ఇదే రీతిలో ఓ యువతి వరకట్న వేధింపులు తాళ లేక ఆత్మహత్యకు పాల్పడింది. ఏన్కూరు ఎస్సీ కాలనీకి చెందిన పూనెం విజయ (23) మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. సంఘటన మంగళవారం రాత్రి జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏన్కూరు ఎస్సీ కాలనీకి చెందిన చిలుకూరి అఖిల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం, వేములవాడ గ్రామానికి చెందిన పూనెం విజయ ప్రేమించుకున్నారు. ఏడాది క్రితం వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంతకాలం వరకు సాఫీగానే సాగిన వీరి కాపురంలో కలహాలు చోటుచేసుకున్నాయి. గత కొన్ని నెలల నుండి తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అదనపు కట్నం తీసుకురావాలని అత్తింటి వారు మానసిక క్షోభకు గురిచేశారు. అత్త శిరోమణి, భర్త అఖిల్, ఆడబిడ్డ కీర్తన తరచూ వేధిస్తున్నారని, దీన్ని తట్టుకోలేక యువతి ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. తన బిడ్డను భర్త, అత్త, ఆడబిడ్డ కలిసి చంపారని మృతురాలి తల్లి సమ్మక్క పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు ఎస్ఐ బాదావత్ రవి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.