కంటోన్మెంట్ బోర్డు గ్రీన్ సిగ్నల్.. సిటీలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు!

  • Author singhj Published - 09:54 PM, Fri - 11 August 23
  • Author singhj Published - 09:54 PM, Fri - 11 August 23
కంటోన్మెంట్ బోర్డు గ్రీన్ సిగ్నల్.. సిటీలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు!

ట్రాఫిక్.. మన జీవితాల్లో తరచూ వాడే పదాల్లో ఇది కూడా సర్వసాధారణం అయిపోయింది. సొంత వాహనాల్లో ప్రయాణించే వాళ్లే కాదు.. బస్సులు, ఆటోలు, ట్యాక్సీల్లో ప్రయాణించే వారినీ ట్రాఫిక్ కష్టాలు వీడటం లేదు. ఇదేదో మన హైదరాబాద్ నగరానికి వచ్చిన సమస్య మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ సిటీలుగా పేరొందిన చాలా వాటిల్లో ఇదే పరిస్థితి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పెద్దగా మార్పు కనిపించడం లేదు. హైదరాబాద్​లో వాహనాల రద్దీ అంతకంతకూ పెరుగుతూ పోతోంది. ఓన్ వెహికిల్స్ ఎక్కువవడం, కార్ పూలింగ్ లాంటివి లేకపోవడంతో ట్రాఫిక్ పెరుగుతోంది.

గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్​లో వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది. ఉద్యోగులు పని ముగించుకొని వెళ్లే టైమ్​కు వాన పడుతుండటంతో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు జామ్ అవుతున్నాయి. ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి కేసీఆర్ ప్రభుత్వం నగరంలో చాలా ఫ్లై ఓవర్లు, అండర్​పాస్​లు నిర్మించింది. కొత్తగా మరిన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది. మెట్రో సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు ఎలాగూ ఉంది. ఇదిలా ఉంటే.. బోయిన్​పల్లి, తిరుమలగిరి ప్రాంతాల్లో ఇక మీదట ట్రాఫిక్ ఇక్కట్లు తప్పనున్నాయి.

బోయిన్​పల్లి, తిరుమలగిరిలో ఉన్న రోడ్లను విస్తరించేందుకు వీలుగా రాష్ట్ర సర్కారుకు భూములు ఇచ్చేందుకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అంగీకరించింది. ఎన్​హెచ్​ 44 ప్యారడైజ్-సుచిత్ర, ఎన్​హెచ్​1 జింఖానా గ్రౌండ్-హకీంపేట్ దాకా రోడ్డు విస్తరణ కోసం 33 ఎకరాల భూమిని ఇచ్చే తీర్మానాన్ని తాము ఆమోదించామని బోర్డు సీఈవో మధుకర్ నాయక్ తెలిపారు. ప్రైవేటు, ఆర్మీ, బీ2 కలిపి మొత్తంగా 124 ఎకరాల కేటాయింపు విషయం ఆయా శాఖలు చూసుకుంటాయని ఆయన వెల్లడించారు. కాగా, కంటోన్మెంట్ బోర్డు ఇస్తున్న 33 ఎకరాలకు గానూ రాష్ట్ర సర్కారు రూ.329 కోట్లను చెల్లిస్తోంది. ఈ డబ్బులను కంటోన్మెంట్ పరిధిలో ఇతర డెవలప్​మెంట్ ప్రోగ్రామ్స్​ కోసం వాడతారు. బోర్డు ఇచ్చిన భూముల్లో రోడ్డు విస్తరణ ద్వారా బోయిన్​పల్లి, తిరుమలగిరి రూట్లలో ట్రాఫిక్ తగ్గనుంది.

Show comments