పంచాయతీ ఎన్నికలపై బిగ్ అప్డేట్.. ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్ రిలీజ్!

తెలంగాణలో లోక్ సభ, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతూ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. త్వరలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం.

తెలంగాణలో లోక్ సభ, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతూ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. త్వరలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం.

తెలంగాణలో గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లు పాలన కొనసాగించిన బీఆర్ఎస్ ని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సైతం సత్తా చాటింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఈ నేపథ్యంలో కీలక అప్డేట్ ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీల వారీగా ఓటరు జాబితా తయారీ, ప్రచురణపై అధికారులతో చర్చించారు. ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ రిలీజ్ చేసింది. అసెంబ్లీ ఓటరు లీస్టుల ఆధారంగా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలలో వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా ఓటరు లీస్టుల తయారీ, ప్రచురణ కొరకు షెడ్యూల్ రిలీజ్ చేయాలన్నారు. సెప్టెంబర్ 6న ఆయా గ్రామ పంచాయతీలలో వార్డుల వారీగా డ్రాఫ్ట్ ఓటరు జాబితాను ప్రచురిస్తారు.

ఈ జాబితాపై సెప్టెంబర్ 7వ తేది నుంచి 13 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 9,10 తేదీలలో రాజకీయ పార్టీల నుంచి సూచనలు, సలహాలను స్వీకరిస్తారు. సెప్టెంబర్ 21 న వార్డుల వారీగా తుది జాబితాను ప్రచురిస్తారు. ఈ నెల 29న ఓటరు జాబితా తయారీపై జిల్లాతా తయారీపై జాల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే పంచాయతీ ఎన్నికల్లో మరోసారి తమ సత్తా చాటాలని అధికార పార్టీ ఉంటే, ఎలాగైనా తమ ఉనికి కాపాడుకోవడానికి బీఆర్ఎస్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈసారి పంచాయతీ ఎన్నికల్లో ఓటరు ఏ పార్టీకి జై కొడతారో చూడాలి.

Show comments