iDreamPost
android-app
ios-app

గుడ్ న్యూస్.. కాలేజ్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులు.. ఎన్ని రోజులంటే?

  • Published Jan 06, 2024 | 11:13 AM Updated Updated Jan 06, 2024 | 11:21 AM

Sankranthi Holidays for Students: సంక్రాంతి పండుగ చిన్నా.. పెద్ద అందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాలో వారం రోజుల ముందు నుంచే పండుగ సందడి మొదలవుతుంది.

Sankranthi Holidays for Students: సంక్రాంతి పండుగ చిన్నా.. పెద్ద అందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాలో వారం రోజుల ముందు నుంచే పండుగ సందడి మొదలవుతుంది.

  • Published Jan 06, 2024 | 11:13 AMUpdated Jan 06, 2024 | 11:21 AM
గుడ్ న్యూస్.. కాలేజ్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులు.. ఎన్ని రోజులంటే?

దేశంలో సంక్రాంతి పండుగ ఎంతో సంబరంగా జరుపుకుంటారు. తెలుగు వారికి ఎన్ని పండుగులు ఉన్నా.. సంక్రాంతి పండుగ ఎంతో ప్రత్యేకం. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారు తమ స్వగ్రామాలకు చేరుకుంటారు. సంక్రాంతి పండుగ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేవి కోడి, ఎడ్ల పందాలు. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో జల్లికట్టు క్రీడ కూడా ఆడుతుంటారు. చిన్నా.. పెద్ద తేడా లేకండా పతంగులు ఎగురవేస్తుంటారు. సంక్రాతికి కొత్త అల్లుళ్ళ సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. నోరూరించే రక రకాల వంటకాలు, గ్రామాల్లో రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు.. ఆటా, పాట ఎంతో సందడిగా ఉంటుంది. సంక్రాంతి పండుగ మూడు రోజులు జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు గుడ్ న్యూస్ చెప్పాయి. వివరాల్లోకి వెళితే..

సంక్రాంతి పండుగ అంటే ఏపీలో కనీసం వారం రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది. గ్రామాల్లో ఎడ్ల పందాలు, కోళ్ల పందాలతో కోలాహలం నెలకొంటుంది. గ్రామాల్లో ఇంటి ముందు అందమైన రంగవల్లులు.. పులిహోహ, బొబ్బట్లు, అరిసెలు, పరమాన్నం వంటి సంప్రదాయ వంటకాలు వండుతారు.. బంధువులతో కలిసి ఒకేచోట పండుగ నిర్వహించుకుంటారు. ఏపీలో విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులపై కొనసాగుతున్న సందిగ్ధతపై క్లారిటీ వచ్చింది. జనవరి 9 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లా విద్యా శాఖాధికారులకు అన్ని యాజమాన్యలకు ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసింది. జనవరి 13న రెండో శనివారం, 14 బోగి పండు, జనవరి 15న సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ క్రమంలోనే విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 16,17, 18 వ తేదీ వరకు సెలవులు ఖారారు చేసింది. వాస్తవానికి జనవరి 16 వరకు సెలవులు ఇవ్వాలని భావించినా.. స్కూల్, కాలేజీలకు మరో రెండు రోజులు అదనంగా సెలవులు ప్రకటించింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఇక తెలంగాణలో విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. జనవరి 12 నుంచి 17 వరకు సెలవులు ఉంటాయని తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ ప్రకటన విడుదల చేశారు. మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని పాఠశాలలకు ఈ సంక్రాంతి సెలవులు ఉండబోతున్నాయని తెలిపింది. 13 న రెండో శనివారం కనున్న ఆ రోజు.. 14,15,16 సంక్రాంతి పండుగ.. అయితే 17వ తేదీన ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 18 వ తేదీ నుంచి విద్యాసంస్థలు యథావిధిగా తెరుచుకుంటాయని ప్రకటనలో వెల్లడించింది. మొత్తానికి తెలుగు రాష్ట్రాలో విద్యార్థులు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.