దూసుకొస్తున్న రైలుకు ఎదురెళ్లిన యువకుడు.. వీడియోను ట్విట్ చేసిన సజ్జనార్

సోషల్ మీడియా యుగం కొత్త పుంతలు తొక్కడంతో యువకులు ఎక్కువ సమయం ఇందులోనే గడుపుతున్నారు. అయితే గతంలో వచ్చిన టిక్ టాక్ తో వీడియోలు చేసి ఎంతో మంది ఫేమస్ అయ్యారు. దీంతో అప్పటి నుంచి చాలా మంది టిక్ టాక్ లో వీడియోలు చేసేందుకు ఆసక్తి చూపించేవారు. ఇదే సమయంలో ఉన్నట్టుండి ఇండియా టిక్ టాక్ ను బ్యాన్ చేసింది. అప్పటి నుంచి యువత ఇప్పుడు ఇన్ స్టా గ్రామ్ వైపు మళ్లీ అందులో రీల్స్ చేస్తున్నారు. ఇలా రీల్స్ చేస్తూ తొందరగా ఫేమస్ అవ్వాలని చిత్ర విచిత్రమైన పనులు చేస్తుంటారు. ఇలాగే ఓ యువకుడు.. దూసుకొస్తున్న రైలుకి ఎదురెళ్లి పడుకున్నాడు. ఇదే వీడియో వైరల్ గా మారడంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇదే వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ఇప్పుడున్న సోషల్ మీడియాలో అందరూ ఎక్కువగా వాడుతున్నది ఇన్ స్టా గ్రామ్ అని చెప్పక తప్పదు. అందులో సినిమా పాటలకు రీల్స్ చేయడంతో పాటు కొత్త కొత్త వీడియోలను చేస్తూ తొందరగా ఫేమస్ అవ్వాలని అనుకుంటున్నారు. ఇలా ఎంతో మంది రీల్స్ చేస్తూ ఉన్నారు. అయితే అచ్చం ఇలాగే అనుకున్న ఓ యువకుడు.. ఎదురొస్తున్న రైలు కింద పడుకుని వీడియో చేశాడు. దీంతో ఆ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. ఇక అదే వీడియో చివరికి తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వద్దకు వెళ్లింది. ఆ వీడియోను చూసి ఆయన షాక్ గురయ్యాడు.

దీంతో వెంటనే ఆయన అదే వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. సోషల్ మీడియాలో పాపులర్‌ కావడం కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఫేమస్ కోసం సాహసాలు చేస్తే.. చిన్న పొరపాటు జరిగిన ప్రాణాల మీదికి వస్తుంది. జనాదరణ కోసం జీవితాలను సైతం పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!? అంటూ ఆయన రాసుకొచ్చారు. ఈ వీడియోను చూసిన చాలా మంది ఒక్కొరు ఒకలా కామెంట్స్ చేస్తున్నారు. ఫేమస్ అవ్వడానికి దూసుకొస్తున్న రైలుకు ఎదురెళ్లి పడుకున్న ఈ యువకుడి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: వీడియో: బిజీ బస్టాండ్‌లో జంట పిచ్చి పని.. జనం అవ్వాక్‌!

Show comments