iDreamPost
android-app
ios-app

మేడారం వెళ్లే భక్తులకు సజ్జనార్ బిగ్ షాక్! పెద్ద సమస్యే ఇది!

  • Published Feb 19, 2024 | 3:48 PM Updated Updated Feb 19, 2024 | 3:48 PM

మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్లేందుకు ఇప్పటికే రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు సిద్ధం అయ్యి ఉంటారు. ఈ క్రమంలో అక్కడకు ఆర్టీసీ బస్సులలో వెళ్లే భక్తులకు ఓ షాకింగ్ న్యూస్ ను తెలియజేసారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.

మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్లేందుకు ఇప్పటికే రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు సిద్ధం అయ్యి ఉంటారు. ఈ క్రమంలో అక్కడకు ఆర్టీసీ బస్సులలో వెళ్లే భక్తులకు ఓ షాకింగ్ న్యూస్ ను తెలియజేసారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.

  • Published Feb 19, 2024 | 3:48 PMUpdated Feb 19, 2024 | 3:48 PM
మేడారం వెళ్లే భక్తులకు సజ్జనార్ బిగ్ షాక్! పెద్ద సమస్యే ఇది!

దేశంలోనే అతి పెద్ద జారతగా పేరొందిన మేడారం సమ్మక్క-సారక్క జాతరకు మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. దేశ నలుమూలల నుంచి కూడా ఈ జాతరను చూడడానికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇప్పటికే అక్కడ భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ముఖ్యంగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఈ జాతర మరింత ప్రత్యేకం. ఎంతో మంది తెలుగు ప్రజలు ఈ జాతరకు తమ మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అక్కడ భద్రత చర్యల దృష్ట్యా .. తాజాగా వరంగల్ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాలలో .. అధికారులకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఆ సమావేశంలో పాల్గొన్న సజ్జనార్.. మేడారం వెళ్లే భక్తులకు తగు సూచనలు ఇచ్చారు . అంతేకాకుండా అక్కడికి వెళ్లే బస్సులలో ప్రయాణించేవారికి ఓ షాకింగ్ న్యూస్ ను తెలియజేశారు సజ్జనార్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

సాధారణంగా మేడారం జాతరకు వచ్చేవాళ్లలో దాదాపు అందరు .. వారి వారి మొక్కులను చెల్లించుకునే వారే ఎక్కువమంది ఉంటారు. అందులో చాలా మంది భక్తులు కోళ్లను, మేకలను, గొర్రెలను ఇలా అమ్మవారికి మొక్కుగా చెల్లిస్తూ ఉంటారు. ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే, మేడారం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేకించి ప్రభుత్వం ఆరు వేలకు పైగా బస్సులను కూడా కేటాయించిందని ఆర్టీసీ ఎండి సజ్జనార్ తెలియజేశారు. కానీ, ఆ బస్సులలో మూగజీవాలకు మాత్రం ఎంట్రీ లేదని తేల్చి చెప్పేశారు సజ్జనార్. ఈ విషయంలో అందరు తమవంతు సహకారం అందించాలని కూడా కోరారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 51 పాయింట్స్ నుంచి ఈ బస్సులను నడిపించనున్నట్లు తెలిపారు. కాగా, ఈసారి మొత్తం 30 లక్షల మంది ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే అవకాశం ఉందని .. అంచనా వేస్తున్నారు అధికారులు. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు లభించేలా.. తగిన ఏర్పాట్లు చేస్తామని వివరించారు.

మేడారం జాతరకు వెళ్లే భక్తులతో పాటు.. ఈ జాతరలో 15వేల మంది సిబ్బంది విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారని. వారికీ కూడా తగిన ఏర్పాట్లు చేయాలనీ అధికారులకు సూచించారు. అలాగే బస్సు డ్రైవర్లు కూడా సురక్షితంగా వాహనాలను నడపాలని తెలియజేశారు. అంతేకాకుండా ఆర్టీసీ సిబ్బంది.. ప్రయాణికుల పట్ల సేవాభావంతో వారి వారి విధులు నిర్వహించాలని సూచించారు. కాబట్టి, మేడారం సమ్మక్క సారక్క వెళ్లే భక్తులను దృష్టిలో ఉంచుకుని.. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పి తీరాలి. మరి, ఆర్టీసీ బస్సులలో మూగ జీవాలకు ఎంట్రీ లేదని సజ్జనార్ సూచించిన విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.