iDreamPost
android-app
ios-app

తెలంగాణలో రోడ్డు ప్రమాదం.. పోలీసు వాహనం బోల్తా!

ప్రమాదం ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో ఎవరం చెప్పలేము. తాజాగా ఆదివారం తెలంగాణలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. సీఎం సభకు బందోబస్తు విధులకు హాజరై.. తిరుగి వస్తున్న పోలీసుల వాహనం ప్రమాదానికి గురైంది.

ప్రమాదం ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో ఎవరం చెప్పలేము. తాజాగా ఆదివారం తెలంగాణలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. సీఎం సభకు బందోబస్తు విధులకు హాజరై.. తిరుగి వస్తున్న పోలీసుల వాహనం ప్రమాదానికి గురైంది.

తెలంగాణలో రోడ్డు ప్రమాదం.. పోలీసు వాహనం బోల్తా!

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో తీవ్ర గాయాలతో జీవితాన్ని నరకప్రాయంగా అనుభవిస్తున్నారు. ఇక ఇలాంటి ప్రమాదాల బారిన పోలీసులు వాహనాలు కూడా పడుతున్నాయి. తాజాగా తెలంగాణ జిల్లాలో ఓ పోలీసుల వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈప్రమాదంలో ఇద్దరు పోలీసులు పరిస్థితి విషయంగా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఆదివారం తెలంగాణ రాష్ట్రం, నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వదా సభ జరిగింది. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరై.. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచకపడ్డారు. ఇక ఈ సభకు మదనాపురం ఠాణాలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు అన్నపూర్ణ, నాగర్ కర్నూల్ ఠాణాకు చెందిన ఆర్ఐ శివాజీ, డ్రైవర్ తిరుపతి వెళ్లారు. కొల్లాపూర్ లో జరిగిన సీఎం కేసీఆర్ సభలో వీరు బందోబస్తు విధులు నిర్వహించారు. ప్రజా ఆశీర్వద సభ అనంతరం సాయంత్రం వీరందరూ కలిసి ఒకే వాహనంలో నాగర్‌కర్నూల్‌ పట్టణానికి బయలు దేరారు. మార్గం మధ్యలో దేశిటిక్యాల అనే గ్రామ సమీపంలో వీరు ప్రయాణిస్తున్న పోలీసు వాహనం అదుపు తప్పి బోల్తా పడింది.

ఇలా బోల్తా పడిన కారు రహదారి పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీ కొట్టింది. ప్రమాదంలో మంజుల, జయంతి, అన్నపూర్ణకు తీవ్ర గాయాలు అయ్యాయి. అలానే ఆర్‌ఐ శివాజీ, డ్రైవర్‌ తిరుపతికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు నాగర్ కర్నూల్ లోని జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. వీరిలో మంజుల, జయంతి పరిస్థితి విషమం ఉందని వైద్యులు తెలిపారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. అన్నపూర్ణను మహబూబ్‌నగర్‌  ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లోని జయంతి కూతురు ఏడాది పాపకు.. ఈ వాహనంలో ప్రయాణిస్తుంది. ఆ పాపకు కూడా స్వల్ప గాయాలయ్యాయి.

ఇటీవలే జమ్ముకాశ్మీర్ లో కూడా ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు 33 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందారు. అలానే పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా  ఓ వాహనం లోయలో పడి.. 20 మందికి గాయాలయ్యాయి.  క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి..చికిత్స అందించారు. మరి.. ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి