Dharani
Revanth Reddy-Rythu Runa Mafi 3rd Phase: తెలంగాణ రైతుల ఖాతాలో నేడు 2 లక్షల రూపాయలు జమ కానున్నాయి. ఆ వివరాలు..
Revanth Reddy-Rythu Runa Mafi 3rd Phase: తెలంగాణ రైతుల ఖాతాలో నేడు 2 లక్షల రూపాయలు జమ కానున్నాయి. ఆ వివరాలు..
Dharani
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆరు గ్యారెంటీల అమలుతో ప్రజలకు మరింత చేరువవుతోంది. ఇప్పటికే అన్ని ప్రధాన హామీలను అమలు చేసింది. అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ పెంపు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి హామీలను అమలు చేసింది. ఇక ఆరు గ్యారెంటీల్లో అతి ముఖ్యమైన 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలుకు శ్రీకారం చుట్టింది. జూలైలో దీన్ని ప్రారంభించింది. మూడు విడతల్లో పూర్తి చేస్తామని చెప్పి.. ఇప్పటికే రెండు విడతల్లో.. లక్ష, రూ.లక్షన్నర వరకు మాఫీ చేసింది. ఇక మూడో విడతలో భాగంగా 2 లక్షల రూపాయల రుణమాఫీకి నేడు శ్రీకారం చుట్టింది. ఆ వివరాలు..
ఇక స్వాతంత్య్ర దినోత్సవం వేళ తెలంగాణ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పడానికి రెడీ అయ్యింది. వారి ఖాతాలో సుమారు 2 లక్షల రూపాయల వరకు జమ చేయనుంది. నేడు ఖమ్మం జిల్లా వైరా బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మూడో విడతలో భాగంగా రైతులకు రూ. 2లక్షల వరకు రుణమాఫీ చెక్కులను అందజేయనున్నారు. మూడో విడత మాఫీతో 42 లక్షల మంది రైతులు రుణ విముక్తులు అవుతారు. మొత్తంగా మూడు దశల్లో కలిసి ప్రభుత్వం రూ.31 వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేసినట్లు అవుతుంది.
కాగా, జులై 18న తొలి విడత రుణమాఫీ చేశారు. రూ. లక్షలోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. మెుత్తం 11.34 మంది అన్నదాతల ఖాతాల్లో రూ.6 వేల కోట్లకు పైగా సొమ్ము జమ చేశారు. జులై 30 రెండో విడతలో భాగంగా రూ.లక్షన్నర లోపు రుణాలను మాఫీ చేశారు. మెుత్తం 6.40 లక్షల మంది రైతుల బ్యాంకు అకౌంట్లలో రూ.6.190 కోట్లు జమ చేశారు. రెండు విడతల్లో కలిపి మెుత్తం 17.75 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.12,224 కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం చెప్పింది. నేడు మిగిలిన రైతులకు కూడా రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది
ఇక అర్హులైన కొందరు రైతులకు రుణమాఫీ వర్తించలేదు. అలాంటి వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వారికోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని.. అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ వర్తింప చేస్తామని ప్రభుత్వం తెలిపింది.