ఉస్మానియ విద్యార్థులు అడ్డ మీద కూలీల్లాంటి వాళ్లు.. రేవంత్‌ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి.. ఓయూ విద్యార్థులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆ వివరాలు..

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి.. ఓయూ విద్యార్థులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆ వివరాలు..

తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. నవంబర్‌ 30న ఎన్నికలు జరగనున్నాయి. దాంతో పార్టీలన్ని ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌.. రోజుకు రెండు, మూడు బహిరంగ సభల్లో పాల్గొంటూ.. ప్రచార కార్యక్రమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ కూడా ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉంది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నయ శక్తిగా ఎదగాలని కాంగ్రెస్‌ తీవ్రంగా కృషి చేస్తోంది. ఆరు గ్యారెంటీల పేరుతో మేనిఫెస్టో ప్రకటించింది. తెలంగాణలో కాంగ్రెస్‌ గెలుపు కోసం రాష్ట్ర నేతలు మాత్రమే కాక ఏఐసీసీ పెద్దలు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు. రాహుల్‌ గాంధీ.. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

ఇక ఎన్నికల వేళ నోరు ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది. అసలే ఇది సోషల్‌ మీడియా యుగం.. ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా సరే.. వైరలయిపోతాం. ఈ విషయం తెలిసి కూడా కొందరు నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటారు. ఇక తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి.. ఓయూ విద్యార్థులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఓయూ విద్యార్థులను అడ్డా మీద కూలీలు.. బీర్లు, బిర్యానీలు తిని.. అది అరక్క మొత్తుకుంటున్నారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు రేవంత్‌ రెడ్డి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రేవంత్‌ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎందుకు ఉస్మానియా విద్యార్థులు.. రాహుల్‌ గాంధీ రాకను వ్యతిరేకిస్తున్నారు అన్న ప్రశ్నకు రేవంత్‌ బదులిస్తూ.. ‘‘ఏం లేదు.. చిల్లర ఖర్చుల కోసం కేటీఆర్‌ దగ్గర నుంచి ఇంత తెచ్చుకుని ఉంటారు. పక్కనే ఉన్న తార్నక వెళ్లి బీర్లు తాగి, బిర్యానీలు తిన్న తర్వాత.. అది అరిగేదాక.. అక్కడకు వచ్చి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడి ఉంటారు. ఓయూ విద్యార్థులు అడ్డ మీద కూలీలాంటోళ్లు. వాళ్లకంటూ ఓ సిద్ధాంతం కానీ, ఆలోచన కానీ, వాళ్లకంటూ తెలంగాణ పట్ల గౌరవం అంటూ ఏమి లేదు’’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీనిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వీడియో ప్రస్తుతందా.. పాతది మరోసారి వైరలవుతుందా అన్న విషయం తెలియదు.

Show comments