Revanth Reddy: వీడియో..రేవంత్ అన్నా అన్న పిలుపు వినగానే.. కదలి వచ్చిన CM.. వెంటనే సాయం

ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టుగా.. రాష్ట్రానికి సీఎం అయినా సరే.. సామాన్యులకు, తనను నమ్ముకున్నవారికి ఎప్పటికీ రేవంత్ అన్ననే అని మరోసారి నిరూపించుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. అన్నా అన్న పిలుపు విని.. ఆగి మరీ సాయం చేశారు. ఆ వివరాలు..

ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టుగా.. రాష్ట్రానికి సీఎం అయినా సరే.. సామాన్యులకు, తనను నమ్ముకున్నవారికి ఎప్పటికీ రేవంత్ అన్ననే అని మరోసారి నిరూపించుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. అన్నా అన్న పిలుపు విని.. ఆగి మరీ సాయం చేశారు. ఆ వివరాలు..

ముఖ్యమంత్రి అంటే.. ఆయన సామాన్యులకు అతీతుడు.. ఏవో అధికారిక కార్యక్రమాలకు హాజరైతే తప్పా.. ఆయనను జనాలు చూడటం చాలా అరుదు.. అప్పుడు కూడా సీఎం చుట్టూ పదుల సంఖ్యలో భద్రతా అధికారులు, మంత్రులు, మంది మార్బలం ఉంటారు. అసలు ముఖ్యమంత్రి బయట అడుగుపెడుతున్నారంటేనే.. ఆ చుట్టు పక్కల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి.. రక్షణ వలయాన్ని రెడీ చేస్తారు. ఇక సీఎం వస్తున్నారంటే.. చాలా మంది జనాలు కేవలం ఆయనను చూడటం కోసం గుమిగూడతారు. ముఖ్యమంత్రిని చూడగానే సీఎం సాబ్.. సీఎం సార్ అంటూ నినాదాలు చేస్తారు జనాలు. కానీ అధినేత వారిని పట్టించుకోకుండానే ముందుకు సాగుతాడు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అంటే జనాల్లో ఉన్న అభిప్రాయం ఇదే. మరి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి కూడా ఇలానే ప్రవర్తిస్తారా అంటే.. నూటికి నూరుపాళ్లు కాదు.. అందుకు నిదర్శనం ఈ వీడియో..

సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం నాడు.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించేందుకు సోమాజీగూడలోకి యశోద ఆప్పత్రికి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ఆస్పత్రిలోకి రాగానే.. అక్కడే ఉన్న ఓ యువతి.. రేవంత్ అన్నా అంటూ నోరారా పిలిచింది. మరీ ఆడబిడ్డ అన్నా అని పిలిస్తే.. ముక్కు మొఖం తెలియని వాళ్లే ఆగి.. ఆమెకు వచ్చిన సమస్య ఏంటో అడిగి తెలుసుకుంటారు. అలాంటిది సదరు మహిళ ఏకంగా సీఎంనే అన్నా అంటూ నోరారా పిలిచింది.. ఆ పిలుపు ఆయనను కూడా కట్టిపడేసింది. వెంటనే సీఎం రేవంత్ తనను పిలిచిన మహిళ దగ్గరకు తనే స్వయంగా వెళ్లారు. ఆమె కష్టం ఏంటో అడిగి తెలుసుకున్నారు.

“రేవంత్ అన్నా మీతో ఒకసారి మాట్లాడాలన్నా..” అన్న యువతి మాట వినగానే.. వెంటనే స్పందించి.. అక్కడే ఉండమ్మా నేనే వస్తున్నా అంటూ ఆమె దగ్గరికి వెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏమైందమ్మా అని అడగ్గా.. తన తండ్రిని ఆస్పత్రిలో చేర్చామని.. ఒక్క రోజుకే ఒకటిన్నర లక్ష బిల్లయిందని.. మీరే ఆదుకోవాలన్నా.. అంటూ ఆ యువతి సీఎం ముందు తన గోడు వెల్లబోసుకుంది. ఆమె బాధ విన్న.. వెంటనే తనతో ఉన్న అధికారులను పురమాయించి.. విషయం ఏంటో తెలుసుకుని.. అవసరమైన సాయం అందేలా చూడాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బాధపడొద్దని.. ధైర్యంగా ఉండాలని.. సీఎం రేవంత్ ఆ అమ్మాయికి భరోసా ఇచ్చారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. అన్నా అనగానే స్పందించావ్ చూడు.. దటీజ్ రేవంత్ అన్నా.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం నీ సొంతం అని ఈ సంఘటనతో మరోసారి నిరూపితమైంది.. నువ్వు నిజమైన ప్రజల నాయకుడివి.. ఈ ఒక్క చర్యతో మీరు మరో మెట్టు ఎక్కేశారు.. ఇప్పటివరకు రేవంత్ రెడ్డిని ఆయన అభిమానులు మాత్రమే అభిమానించగా.. ఈ సన్నివేశాన్ని చూసిన చాలా మంది విమర్శకులు కూడా ఆయనను అభిమానించటం ఖాయం అంటున్నారు నెటిజనులు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి దీనిపై మీ అభిప్రాయానలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments