Rythu Runa Mafi: రైతులకు శుభవార్త.. ఖాతాల్లోకి రుణమాఫీ నిధులు.. ఎప్పుడంటే

Revanth Reddy-Rythu Runa Mafi, Rs 1 Lakh: తెలంగాణ రైతులకు రేవంత్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు వేసేందుకు ముహుర్తం నిర్ణయించింది. ఎప్పుడంటే..

Revanth Reddy-Rythu Runa Mafi, Rs 1 Lakh: తెలంగాణ రైతులకు రేవంత్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు వేసేందుకు ముహుర్తం నిర్ణయించింది. ఎప్పుడంటే..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చేందుకు రెడీ అయ్యింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఆరు గ్యారెంటీల అమలకు కట్టుబడి ఉంటామని చెప్పింది. అనడమే కాక ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, జీరో కరెంట్‌ బిల్లు, 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌, ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంపు చేపట్టింది. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి కూడా రెడీ అవుతోంది. వీటితో పాటు అన్నదాతలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న 2 లక్షల రూపాయల రుణమాఫీ, ఎకరాకు 15 వేల పెట్టుబడి సాయం హామీలు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే రైతు భరోసా అమలుపై ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుండగా.. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు.

ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీకి కేబినెట్‌ కూడా ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే గైడ్‌లైన్స్‌ జారీ చేసింది. రుణమాఫీకి ఎవరు అర్హులో ప్రకటించింది. అయితే ఈ పథకం అమలుకు రేషన్‌కార్డు తప్పనిసరి చేసింది ప్రభుత్వం. దీనిపై ఇప్పటికే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. రుణమాఫీకి సంబంధించి రేవంత్‌ సర్కార్‌ భారీ శుభవార్త చెప్పింది. మరో రెండు రోజుల్లో రైతుల ఖాతాలో రుణమాఫీ నిధులు జమ చేస్తామని చెప్పుకొచ్చింది. జూలై 18 అనగా గురువారం నాటికి లక్ష రూపాయల వరకు రుణమాఫీ నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం సాయంత్రం లోగా రైతుల రుణ ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అదే రోజు అనగా జూలై 18, గురువారం నాడు.. రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులు సంబురాలు నిర్వహించాలని.. వీటికి ఆయా నియోజకవర్గాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కావాలని సీఎం రేవంత్‌ ఆదేశాలు జారీ చేశారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర అకౌంట్లలో జమ చేసుకుంటే.. బ్యాంకర్లపైసన కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు.

అలానే రుణమాఫీకి రేషన్‌ కార్డు తప్పనిసరి అనే నిబంధనపై సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టత ఇచ్చారు. సచివాలయంలో మంగళవారం నాడు కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూమి పాస్‌ బుక్‌ల ఆధారంగానే కుటుంబానికి రూ. 2 లక్షల రుణమాఫీ వర్తిస్తుందని పేర్కొన్నారు. అంతేకాక కేవలం రైతు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్‌ కార్డు నిబంధన అని స్పష్టం చేశారు.

Show comments