iDreamPost
android-app
ios-app

కుమారి ఆంటీ హోటల్‌ సీజ్‌.. సీఎం రేవంత్‌ కీలక నిర్ణయం

  • Published Jan 31, 2024 | 12:59 PM Updated Updated Jan 31, 2024 | 1:07 PM

Kumari Aunty: కుమారి ఆంటీ హోటల్‌ సీజ్‌ వ్యవహారంపై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారని సమాచారం. ఆ వివరాలు..

Kumari Aunty: కుమారి ఆంటీ హోటల్‌ సీజ్‌ వ్యవహారంపై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారని సమాచారం. ఆ వివరాలు..

  • Published Jan 31, 2024 | 12:59 PMUpdated Jan 31, 2024 | 1:07 PM
కుమారి ఆంటీ హోటల్‌ సీజ్‌.. సీఎం రేవంత్‌ కీలక నిర్ణయం

సోషల్‌ మీడియా ద్వారా విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్న కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేసి.. ఆమె ఫుడ్‌ వ్యాన్‌ను పోలీస్‌ స్టేషన్‌కి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మీడియా, సోషల్‌ మీడియాలో దీని గురించి వార్తలు కూడా వచ్చాయి. ఇక పోలీసుల నిర్ణయంతో ఆమె బిజినెస్‌కి బ్రేక్‌ పడింది. కుమారి ఆంటీ తన సొంత స్థలంలో వ్యాపారం చేయడం లేదని.. ఆమె స్టాల్‌ వద్దకు వచ్చే కస్టమర్ల​ వల్ల​ భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతుందని.. దీని వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారనే కారణంతో.. పోలీసులు ఆమె ఫుడ్‌ వ్యాన్‌ను తరలించారు.

దాంతో ఈ వార్త తెగ వైరలయ్యింది. అక్కడ అంత మంది ఉంటే.. కేవలం కుమారి ఆంటీ ఫుడ్‌ వ్యాన్‌ను మాత్రమే ఎందుకు సీజ్‌ చేశారు.. అని చాలా మంది ప్రశ్నించారు. ఇక కొందరైతే దీనికి రాజకీయ కారణాలు కూడా ఆపాదించారు. సోషల్‌ మీడియాలో కుమారి ఆంటీ వివాదంపై పెద్ద ఎత్తున్న చర్చ సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ అంశానికి సంబంధించి కీలక అప్డేట్‌ వచ్చింది. కుమారి ఆంటీ హోటల్‌ సీజ్‌ ఘటన కాస్త ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వద్దకు చేరింది. ఈ ఘటనకు సంబంధించి ఆయన కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

Kumari Aunty Hotel Revanth's key decision

కుమారి ఆంటీ హోటల్ సీజ్ చేయొద్దు అని.. పోలీసుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. ఈ ఘటన చుట్టూ రాజకీయ రంగు పులుముకోవడంతో.. సీఎం రేవంత్‌​ రెడ్డి రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇక సోషల్‌ మీడియాలో కూడా చాలా మంది కుమారి ఆంటీకి మద్దతుగా కామెంట్స్‌ చేస్తున్నారు. అక్కడ అంతమంది వ్యాపారం చేస్తున్నారు.. వారి ఎవరి వల్ల రాని ట్రాఫిక్‌ సమస్య.. కుమారి ఆంటీ వ్యాన్‌ వల్ల మాత్రమే వస్తుందా అని ప్రశ్నిస్తున్నారు.

ట్రాఫిక్‌ సమస్య వల్లే కుమారి ఆంటీ ఫుడ్‌ వ్యాన్‌ని తొలగించినట్లు పోలీసులు చెబుతుండగా.. ఆమె మాత్రం పోలీసులు కేవలం తన బండిని మాత్రమే ఆపారని, మిగతా అందరి వ్యాపారాలకు అనుమతి ఇచ్చి తన ఒక్కరిపట్లే ఎందుకిలా ప్రవర్తిస్తున్నారని ప్రశ్నించింది. ఈ ఫుడ్‌ వ్యానే తన ఉపాధి అని.. దయచేసి తన కడుపు మీద కొట్టవద్దని ఆమె కోరింది.