iDreamPost
android-app
ios-app

12 ఏళ్లుగా సమాజం కోసం ఫ్రీ సర్వీస్! హేట్సాఫ్ మాస్టర్!

  • Published Feb 17, 2024 | 3:39 PM Updated Updated Feb 17, 2024 | 3:39 PM

ఉద్యోగంలో రిటైర్ అయిన ఓ ఉపాధ్యాయుడు నెల నెల పెన్షన్ తీసుకొని హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకోకుండా రోడ్లపైకెక్కడు. దీంతో ఇతని చేసిన పనికి స్థానికులంతా ఆశ్చర్యపోయారు.

ఉద్యోగంలో రిటైర్ అయిన ఓ ఉపాధ్యాయుడు నెల నెల పెన్షన్ తీసుకొని హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకోకుండా రోడ్లపైకెక్కడు. దీంతో ఇతని చేసిన పనికి స్థానికులంతా ఆశ్చర్యపోయారు.

  • Published Feb 17, 2024 | 3:39 PMUpdated Feb 17, 2024 | 3:39 PM
12 ఏళ్లుగా సమాజం కోసం ఫ్రీ సర్వీస్! హేట్సాఫ్ మాస్టర్!

చాలామంది తాము చేసే పనిని ప్రాణంగా భావిస్తుంటారు. అందుకే ఏదైనా ఉద్యోగం చేసినప్పుడు దానిని పని అనుకోవడం కంటే బాధ్యతల భావించి పనిచేస్తారు. ఈ క్రమంలోనే ఎంతోమందికి నలుగురికి ఆదర్శంగా నిలుస్తుంటారు. అయితే ఈ ఉద్యోగంలో పదవి విరమణ అనేది ప్రతిఒక్కరికి ఉంటుంది. కానీ చాలామంది తమ సర్వీస్ లో పడిన కష్టానికి ప్రతిపలంగా పెన్షన్ తీసుకుంటూ హాయిగా ఇంట్లో విశాంత్రి తీసుకుంటారు. మరికొందరు తమ విధుల్లో చేసిన సర్విసులను గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతుంటారు. అయితే ఖమ్మంలోని ఉపాధ్యాయుడిగా పనిచేసే ఓ టీచర్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాడు. అతను రిటైర్మెంట్ అవ్వగానే విశ్రాంతి తీసుకోవలని అనుకొలేదు. పదవి విరమణ పొందిన ఆయన రోడ్ల పై చేసే పనిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అసలేం జరిగిదంటే..

ఉద్యోగంలో రిటైర్ అయిన తరువాత ఎవరైనా ఏం చేస్తారు..? చక్కగా నెల నెలా వచ్చే పెన్షన్‌ తీసుకుంటూ హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటారు. కానీ, ఖమ్మంలో ఉండే ఓ టీచర్ విషయంలో ఇలా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే రిటైర్మెంట్‌ అనేది కేవలం శరీరానికే కానీ.. సర్వీస్ కాదని అతని అభిప్రాయం. అయితే రిటైర్మెంట్ అయిన తర్వాత ఎవరైనా ఇంటి వద్ద పాఠాలు చెప్పడం చూస్తుంటాం. కానీ, ఈయన మాత్రం అందుకు పూర్తి భిన్నంగా రోడ్లపైకెక్కాడు. ఏకంగా కూడలి వద్ద నిలుచుని ట్రాఫిక్ పోలీస్ అవతారమే ఎత్తాడు. అయితే ఈ టీచర్ పేరు డీఆర్ పట్నాయక్. ఇతను ఉపాధ్యాయుడిగా తన విధుల నుంచి పదవి విరమణ పొందాడు. దీంతో ఇంట్లో ఖాళీగా ఉండటం కంటే ఇలా పబ్లిక్ కు ఫ్రీ సర్వీస్ చేస్తే బాగుంటుందని విన్నూతంగా వ్యవహరించాడు. అందుకే ఈ విధంగా ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తూ ఫ్రీ సర్వీస్ చేస్తున్నాడు. అయితే.. ఇలా ఒక రోజు రెండు రోజులు మాత్రం కాదు.. ఏకంగా 12 సంవత్సరాలుగా ఎంతో బాధ్యతగా ఫ్రీ సర్వీస్ చేస్తున్నాడు. ఇలా 10 మందికి ఆదర్శంగా నిలిచే ఈ ఉపాధ్యాయుడిని చూసి అందరూ ప్రశంసిస్తున్నారు. మరి, రిటైర్ మెంట్ అయిన టీచర్ ఇలా పబ్లిక్ టీచర్ గా మారడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.