P Venkatesh
TG CPGET 2024: విద్యార్థులకు గుడ్ న్యూస్. కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. అధికారులు నేడు ఫలితాలను రిలీజ్ చేశారు. ఫలితాలను ఇలా పొందండి.
TG CPGET 2024: విద్యార్థులకు గుడ్ న్యూస్. కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. అధికారులు నేడు ఫలితాలను రిలీజ్ చేశారు. ఫలితాలను ఇలా పొందండి.
P Venkatesh
డిగ్రీ అనంతరం పీజీ కోర్సులు చేయాలంటే ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఈ ఏడాది కూడా పీజీ ప్రవేశాల కోసం కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించారు. పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలు, వాటి పరిధిలోని అనుబంధ కళాశాలల్లో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంఈడీ, ఎంపీఎడ్ తదితర కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష ఫలితాలను అధికారులు విడుదల చేశారు. నేడు(శుక్రవారం) మధ్యాహ్నం 3.30 గంటలకు రిజల్ట్స్ ను రిలీజ్ చేశారు. సీపీగెట్ ఫలితాలను ఉస్మానియా యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
ఈ ప్రవేశాలకు సంబంధించిన రాతపరీక్షలను కంప్యూటర్ బేస్డ్ విధానంలో జులై 6 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించారు. 73,342 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 64,765 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది విద్యార్థులు తమ ర్యాంకు కార్డులను పొందొచ్చు. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి ర్యాంక్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ర్యాంక్ కార్డు కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.