P Krishna
డబ్బు సంపాదన కోసం ఎన్నో రకాల అక్రమ దందాలు చేస్తుంటారు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించి సొసైటీల లగ్జరీ జీవితాన్ని గడపాలని చూస్తుంటారు కొంతమంది కేటుగాళ్ళు. దేశంలో లంచాల పరంపర కొనసాగుతూనే ఉంది.. ప్రభుత్వ ఉద్యోగిగా మంచి పొజీషన్ లో ఉన్నా.. లంచాలు డిమాండ్ చేస్తూ సామాన్యులు ఇబ్బందులకు గురి చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.
డబ్బు సంపాదన కోసం ఎన్నో రకాల అక్రమ దందాలు చేస్తుంటారు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించి సొసైటీల లగ్జరీ జీవితాన్ని గడపాలని చూస్తుంటారు కొంతమంది కేటుగాళ్ళు. దేశంలో లంచాల పరంపర కొనసాగుతూనే ఉంది.. ప్రభుత్వ ఉద్యోగిగా మంచి పొజీషన్ లో ఉన్నా.. లంచాలు డిమాండ్ చేస్తూ సామాన్యులు ఇబ్బందులకు గురి చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.
P Krishna
దేశంలో లంచం ఒక క్యాన్సర్ వ్యాధిలాంటిదని అంటారు. కానీ ఈ కాలంలో ప్రభుత్వ, ప్రైవేట్ శాఖల్లో లంచం లేనిదే పనులు జరగవని తెలిసిందే. ఉద్యోగాలు, కాంట్రాక్టు పనులు, ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పనులు జరగాలంటే కొంతమంది అధికారుల చేతులు తడపాల్సిందే అంటారు. అలాంటి లంచగొండి అధికారులపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తూను ఉంటారు. కానీ వారిలో మాత్రం మార్పు రాదు. ఇటీవల పలువురు అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులను అక్రమంగా కూడబెట్టి.. ఏసీబీ సోదాల్లో బయటపడుతున్నారు. ఈ క్రమంలోనే వంద కోట్ల అక్రమాస్తుల కేసుల విషయంలో హెచ్ ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
ఆదాయినికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రేరా) కార్యదర్శి శివ బాలకృష్ణని అరెస్ట్ చేశారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆయనను ఏసీబీ అధికారులు అరెస్ట్ అయ్యారు. బుధవారం ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే వందకోట్లకు పైగా అక్రమాస్తులు ఉన్న నేపథ్యంలో ఆయనను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయనను బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. కాగా, శివ బాలకృష్ణ హెచ్ఏండీఏ ప్రాణాళిక విభాగంలో డైరెక్టర్ గా ఉంటూనే ఎంఏయూడీ లో ఇన్ చార్జిగా కొనసాగారు.
ఈ సందర్భంగా ‘హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నాం.. రేపు ఆయనను కోర్టులో హాజరు పరుస్తాం.. ఆ తర్వాత కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని తదుపరి విచారణ కొనసాగిస్తాం. తనిఖీ సమయంలో ఆయనతో పాటు కుటుంబ సభ్యులు మాకు సహకరించలేదు’ అంటూ ఏసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది. శివబాలకృష్ణ ఇంట్లో సోదాలు ముగియగా.. మరో నాలుగు చోట్ల సోదాలు చేయాల్సి ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన సతీమణి కి సంబంధించిన బ్యాంకు లాకర్స్ ను ఏసీబీ అధికారులు తెరువనున్నారు. ఇప్పటికే ఆయనపై ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసు నమోదు అయ్యింది.