Dharani
Revanth Govt-Bathukamma Saries: బతుకమ్మ పండుగ సందర్భంగా రేవంత్ సర్కార్ ఆడపడుచులకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోందని సమాచారం. ఆ వివరాలు..
Revanth Govt-Bathukamma Saries: బతుకమ్మ పండుగ సందర్భంగా రేవంత్ సర్కార్ ఆడపడుచులకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోందని సమాచారం. ఆ వివరాలు..
Dharani
తెలంగాణ వారికి బతుకమ్మ పెద్ద పండుగ. శరన్నవరాత్రలు ప్రారంభమైన నాటి నుంచి తెలంగాణలో బతుకమ్మ సంబురాలు మొదలవుతాయి. ఆడబిడ్డలు తంగేడు, గునుగు, బంతి, చామంతి పూలతో.. బతుకమ్మలను అలకంరించి.. ఒక్క దగ్గరకు చేరి.. పాటలు పాడుతూ.. ఎంతో ఉత్సాహంగా పండుగ చేసుకుంటారు. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం ఎక్కడెక్కడో స్థిరపడ్డ వారు.. దసరాకు ఇంటికి చేరుకుంటారు. ఇక బతుకమ్మ ఉత్సవాల కోసం ప్రభుత్వం సైతం ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తుంది. ఇక ఈ ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా రేవంత్ సర్కార్ ఆడపడుచులకు శుభవార్త చెప్పింది. వారి ఖాతాలో నగదు జమ చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఆ వివరాలు..
గతంలో తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం.. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేసేది. అయితే వీటిపై విమర్శలు వచ్చేవి. నాణ్యాత లేని చీరలు పంపిణీ చేస్తున్నారని జనాలు మండిపడేవారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని.. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. రేవంత్ రెడ్డి సర్కార్ ఈసారి బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు పంపిణీ చేయవద్దనే నిర్ణయానికి వచ్చినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీని ప్రకారం చూసుకుంటే.. ఈ సారి.. తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ ఉండబోదు అంటున్నారు.
మరి చీరల బదులు ఏం ఇస్తారంటే.. నగదు. పండుగ కానుకగా.. చీరల బదులు మహిళల ఖాతాలో నగదు జమ చేయనున్నారని సమాచారం. అయితే డబ్బులు ఇవ్వాలని భావిస్తే.. ఎవరికి ఇవ్వాలి, ఎవరు దీనికి అర్హులు అనే విషయంపై కసరత్తు చేస్తోన్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం.. బతుకమ్మ చీరల కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా.. విమర్శలు వచ్చేవి. ఇలా నాసిరకం చీరలు ఇచ్చే బదులు.. ఆ మొత్తం నగదు ఇస్తే.. పండుగ ఖర్చులకి పనికి వస్తాయి అని మహిళలు అభిప్రాయపడేవారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ దీన్నే అమలు చేయబోతున్నట్లు సమాచారం.
అలానే దసరా పండుగ సందర్భంగా రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా చక్కెర, నూనె, బెల్లం, నెయ్యి, శనగలు, కందిపప్పు వంటివి పంపిణీ చేయాలని భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై త్వరలోనే రేవంత్ సర్కార్ తుది నిర్ణయం తీసుకోనుంది. ఇక ఈ ఏడాది దసరా పండుగ అక్టోబర్ 12న రానుంది. ఈలోపు సర్కార్ దీనిపై ఒక నిర్ణయం తీసుకోనుంది అంటున్నారు.