iDreamPost
android-app
ios-app

NEET ప్రశ్నాప‌త్రం మార్పిడి..RDO ఏమన్నారంటే..?

  • Published May 06, 2024 | 2:19 PM Updated Updated May 06, 2024 | 2:19 PM

NEET Question Paper Issue: టెన్త్ తర్వాత విద్యార్థులు ఎంతో కష్టపడి వివిధ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాస్తుంటారు. అందుకోసం అహర్శిశలూ కష్టపడుతుంటారు. ఎగ్జామ్స్ లో పేపర్లు తారుమారైతే విద్యార్థులు పరిస్థితి మాటల్లో చెప్పుకోలేని విధంగా ఉంటుంది. అలాంటి ఘటనలు ఇటీవల తరుచూ జరుగుతున్నాయి.

NEET Question Paper Issue: టెన్త్ తర్వాత విద్యార్థులు ఎంతో కష్టపడి వివిధ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాస్తుంటారు. అందుకోసం అహర్శిశలూ కష్టపడుతుంటారు. ఎగ్జామ్స్ లో పేపర్లు తారుమారైతే విద్యార్థులు పరిస్థితి మాటల్లో చెప్పుకోలేని విధంగా ఉంటుంది. అలాంటి ఘటనలు ఇటీవల తరుచూ జరుగుతున్నాయి.

NEET ప్రశ్నాప‌త్రం మార్పిడి..RDO  ఏమన్నారంటే..?

సాధారణంగా ఎగ్జామ్స్ అంటే విద్యార్థులు ఎంతగా కష్టపడి చదువుతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పది తర్వాత పలు అర్హత పరీక్షలకు కఠోర దీక్షతో చదివి ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాస్తుంటారు. అలా రాసిన ఎగ్జామ్ పేపర్లు తప్పుగా వచ్చాయని తెలిస్తే విద్యార్థుల పరిస్తితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇటీవల పలు సందర్భాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. తాము చేసిన పొరపాటు సరిదిద్దుకునేందుకు అధికారులు నానా తంటాలు పడుతుంటారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. తాజాగా నీట్ పరీక్షలో ఒక పేపర్ బదులు మరో పేపర్ రావడంతో విద్యార్థుల్లో గందరగోళ పరిస్తితి ఏర్పడింది. ఈ ఘటన కొమరం భీం ఆసిఫాబాద్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..

ఇటీవల అధికారులు చేస్తున్న తప్పిదాల వల్ల విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నీట్ ఎగ్జామ్స్ లో ఒక పేపర్ బదులు మరో పేపర్ రావడంతో విద్యార్థులు షాక్ కి గురయ్యారు. దేశ వ్యాప్తంగా విద్యార్థులకు ఎన్‌టీఏ అందించిన పేపర్ ఒకటైతే ఆసిఫాబాద్ జిల్లాలో కేంద్రంలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్ లో అందించిన పేపర్ మరొకటి. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి నీట్ ఎగ్జామ్స్ సంబంధించి బ్యాంకులకు ప్రశ్నాపత్రాలు వస్తాయి. ఆసీఫా బాద్ ఎస్‌బీఐ, కెనరా బ్యాంకులకు ఈ ప్రశ్నా పత్రాలు రాగా, సెంటర్ చీఫ్ కో ఆర్డినేటర్ ఒక ప్రశ్నా పత్రం బదులు మరో ప్రశ్నా పత్రం ఇచ్చారు. ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులు ఇంటికి వెళ్లి మిగతా విద్యార్థులతో ఎగ్జామ్ పేపర్ గురించి ప్రస్తావించగా తాము వేరే ప్రశ్నా పత్రానికి సంబంధించి పరీక్షలు రాసినట్లు తెలియడంతో ఒక్కసారే షాక్ తిన్నారు.

ఈ నేపథ్యంలోలోనే దీనిపై విచారణ చేసిన ఆర్డీవో లోకేశ్వర్ విద్యార్థులకు ఒక పేపర్ బదులు మరో పేపర్ అందినట్లు ఒప్పుకున్నారు. రెండు బ్యాంకులకు వెళ్లే ప్రశ్నా పత్రాలు తెచ్చిన సెంటర్ చీఫ్ కో ఆర్డినేటన్ ఒక ప్రశ్నా పత్రం బాదులు మరోకటి ఇచ్చారని ఆర్డీవో తెలిపారు. ఈ విషయం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులతో మాట్లాడినట్లు వెల్లడించారు. రెండు పేపర్లలో ఏ పేపర్ కు సంబంధించిన పరీక్ష రాసినా దానిని పరిగణలోకి తీసుకుంటామని వారు చెప్పినట్లు ఆర్డీవో లోకేశ్వర్ క్లారిటీ ఇచ్చారు. దేశంలోని ట్యూటికోరింగ్ తో పాటు పలు చోట్ల ఇలాంటి తప్పిదాలు జరిగాయని ఆయన అన్నారు. అయితే ఈ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ పరీక్షా కేంద్రంలో 323 మంది విద్యార్థులకు గాను 299 మంది విద్యార్థులు హాజరయ్యారు.