గుడ్ న్యూస్.. ఆ రోజున వారికి ర్యాపిడో ఫ్రీ రైడ్

ప్రముఖ బైక్ ట్యాక్సీ సంస్థ ర్యాపిడో వారికి గుడ్ న్యూస్ అందించింది. ఆ రోజున ఉచిత రైడ్ లను కల్పించనున్నట్లు ప్రకటించింది. బైక్‌లు, ట్యాక్సీలు, ఆటోలు, క్యాబ్ రైడ్‌ల‌ను ఉచితంగా క‌ల్పించ‌నుంది ర్యాపిడో.

ప్రముఖ బైక్ ట్యాక్సీ సంస్థ ర్యాపిడో వారికి గుడ్ న్యూస్ అందించింది. ఆ రోజున ఉచిత రైడ్ లను కల్పించనున్నట్లు ప్రకటించింది. బైక్‌లు, ట్యాక్సీలు, ఆటోలు, క్యాబ్ రైడ్‌ల‌ను ఉచితంగా క‌ల్పించ‌నుంది ర్యాపిడో.

ప్రస్తుత రోజుల్లో ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే సొంత వాహనం ఉండాల్సిన పనిలేదు. ఎంచక్కా ఆన్ లైన్ లో బైక్, క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లొచ్చు. బుక్ చేసుకుంటే ఉన్న చోటుకే వాహనాలు వస్తుండడంతో ఆన్ లైన్ బుకింగ్ సేవలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ప్రైవేట్ రవాణా రంగంలో ఓలా, ర్యాపిడో, ఉబర్ వంటి బైక్ ట్యాక్సీలు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. ఛార్జీలు కూడా రీజనబుల్ గా ఉండడంతో ప్రయాణికులు వీటినే ఆశ్రయిస్తున్నారు. అయితే ర్యాపిడో బైక్ ట్యాక్సీ కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫర్లు, డిస్కౌంట్ ప్రకటిస్తూ ఉంటుంది. బిజినెస్ ను మరింత విస్తరించుకునేందుకు ఫ్రీ రైడ్ ను కల్పిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో వారికి ర్యాపిడో గుడ్ న్యూస్ అందించింది. ఆ రోజునాడు ఉచిత ప్రయాణాన్ని కల్పించనున్నట్లు తెలిపింది.

దేశంలో లోక్ సభ ఎన్నికలు విడతల వారీగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో ర్యాపిడో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఓటర్లకు ఉచిత రైడ్ లను అందించేందుకు సిద్ధమైంది. ఓటర్లను ఉచితంగా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తామని ప్రకటించారు. మే 13న ఎన్నికల రోజున హైదరాబాద్‌తో సహా కరీంనగర్, ఖమ్మం, వరంగల్ నగరాల్లో ఉచిత సేవలు అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు మే 13న పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల రోజున, ఓటర్లు రాపిడో యాప్‌ లో “VOTE NOW” అనే కోడ్‌ ను ఉపయోగించి ఉచిత రైడ్‌ ను పొందవచ్చని ర్యాపిడో తెలిపింది.

ఓటర్ల కోసం బైక్‌లు, ట్యాక్సీలు, ఆటోలు, క్యాబ్ రైడ్‌ల‌ను ఉచితంగా క‌ల్పించ‌నుంది ర్యాపిడో. ఆ రోజున దేశ‌వ్యాప్తంగా వంద న‌గ‌రాల్లో సుమారు 10 ల‌క్ష‌ల మంది కెప్టెన్లు ఓట‌ర్ల‌కు అందుబాటులో ఉంటార‌ని ర్యాపిడో క‌మ్యూటింగ్ యాప్‌ తెలిపింది. ప్రతి ఓటరు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ర్యాపిడో కోరింది. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి నెలకొంది. సామాన్య కార్యకర్తల నుంచి స్టార్ లీడర్ల వరకు ప్రచారంలో బిజి అయిపోయారు. ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టాలని ప్రధాన రాజకీయపార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు ప్రజల్లో కలియతిరుగుతున్నారు.

Show comments