iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఓటర్లకు ర్యాపిడో బంపర్ ఆఫర్!

  • Published Nov 27, 2023 | 9:26 PM Updated Updated Nov 27, 2023 | 9:26 PM

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీ నేతలు రక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీ నేతలు రక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఓటర్లకు ర్యాపిడో బంపర్ ఆఫర్!

తెలంగాణలో ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్ది రాజకీయ నేతలు ముమ్ముర ప్రచారాలు కొనసాగిస్తున్నారు. ప్రధాన పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామాల్లో ఓట్లు ఉన్నవారు తమ స్వస్థలానికి వెళ్తున్నారు. ఈసారి ఎన్నికలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగబోతుంది. ఈ క్రమంలో సోమవారం ర్యాపిడో బంపర్ ఆఫర్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ వాసులకు ర్యాపిడో గుడ్ న్యూస్ ప్రకటించింది. నగరంలోని 2,600 పోలింగ్ కేంద్రాలకు నవంబర్ 30వ తేదీన పోలింగ్ నేపథ్యంలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సోమవారం వెల్లడించింది. ఓటర్లకు తమ వంతు సహకారం అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ర్యాపిడ్ సంస్థ పేర్కొంది. యువ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు ఉచిత రైడ్ పథకం చాలా వరకు ఉపయోగపడుతుందని ర్యాపిడో సహ వ్యవస్థాపకులు పవన్ గుంటుపల్లి వెల్లడించారు. నిర్లక్ష్యం, బద్దకాన్ని వీడి ప్రతి ఒక్కరూ పోలింగ్ ని ఓ పండుగలా భావించి ముందుక రావాలని ఆయన కోరారు.

పోలింగ్ రోజు దూర ప్రాంతాలకు వెళ్లేందుకు కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ప్రయాణ సౌకర్యాల గురించి దిగులు పడి ఓటు వేయకుండా ఇంటి వద్దే ఉంటారు. ఓటు హక్కు మన జీవితాన్ని నిర్ణయించేది. ఒక్కరోజు నిర్లక్ష్యం ఐదేళ్ల మన తల రాతను మారుస్తుంది. అందుకే ప్రతి ఓటు నమోదయ్యేలా ప్రయత్నం చేస్తున్నందుకు ఎంతో గర్విస్తున్నామని పవన్ తెలిపారు. ఎన్నికల వేళ ప్రతి పౌరుడు తమ ఓటు హక్కు తప్పకుండా వినియోగించుకోవాలి.. అందుకు మా పూర్తి సహకారం ఉంటుంది. ఎలాంటి ప్రదేశాలకైనా వచ్చి ఓటు వేేసేవారిని పికప్ చేసుకునేందుకు మా ఉద్యోగులు రెడీగా ఉంటారు.  అందుకే ఫ్రీ రైడ్ సదుపాయం కల్పిస్తున్నాం.. అని ర్యాపిడో ప్రకటనలో పేర్కొంది.