బిగ్ బ్రేకింగ్: రామోజీరావు కన్నుమూత

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఇక లేరు. నిన్న తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయనను ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఇక లేరు. నిన్న తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయనను ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు రామోజీరావు. శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు నానాక్రంగూడలోని ఆసుపత్రికి తరలించారు. వెంటనే వైద్యులు చికిత్సను ప్రారంభించారు. ఈ క్రమంలో రామోజీరావు ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. రామోజీ రావు అనారోగ్య ప‌రిస్తితిపై కుటుంబ స‌భ్యులు, ఆయ‌న‌ అభిమానులు, సంస్థ సిబ్బంది ఆందోళ‌న చెందారు. కాగా రామోజీరావు చికిత్స పొందుతూ ఈరోజు(శనివారం) ఉదయం మృతి చెందారు. కుటుంబసభ్యులు ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు.

రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు వయస్సు 87 ఏళ్లు. గతకొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. వయస్సు రీత్యా పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆయనకు ఇటీవలే గుండె సంబంధిత వ్యాధుల కోసం స్టంట్స్ కూడా వేశారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. రామోజీ రావు మీడియాతో పాటు అనేక వ్యాపారాల్లో రాణించారు. ఈనాడు సంస్థలు, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌, ప్రియా ఫుడ్స్‌ వంటి వ్యాపారాలు నెలకొల్పి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అంతేగాక రామోజీ ఫిల్మ్‌ సిటీ ఏర్పాటు చేసి హైదరాబాద్, సినీ పరిశ్రమ అభివృద్ధిలో భాగమయ్యారు. రామోజీరావు మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Show comments