iDreamPost
android-app
ios-app

Rajasekhar: GHMCకి హీరో రాజశేఖర్ స్పెషల్ రిక్వెస్ట్! సమస్యగా ఉంది అంటూ!

  • Published Jul 29, 2024 | 6:26 PM Updated Updated Jul 29, 2024 | 6:26 PM

Rajasekhar.. HMCకి హీరో రాజశేఖర్ స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. సమస్యగా ఉంది అంటూ.. దీన్ని పరిష్కరించాలని కోరారు. తన ఎక్స్ ఖాతా ద్వారా ఓ ట్వీట్ చేశారు. ఇంతకు సమస్య ఏంటంటే..?

Rajasekhar.. HMCకి హీరో రాజశేఖర్ స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. సమస్యగా ఉంది అంటూ.. దీన్ని పరిష్కరించాలని కోరారు. తన ఎక్స్ ఖాతా ద్వారా ఓ ట్వీట్ చేశారు. ఇంతకు సమస్య ఏంటంటే..?

  • Published Jul 29, 2024 | 6:26 PMUpdated Jul 29, 2024 | 6:26 PM
Rajasekhar: GHMCకి హీరో రాజశేఖర్ స్పెషల్ రిక్వెస్ట్! సమస్యగా ఉంది అంటూ!

వానా కాలం వచ్చింది అని సంబర పడిపోయే లోపు కుండకు చిల్లులు పడ్డట్లు బ్రేక్ ఇవ్వకుండా వర్షాలు కురుస్తున్నాయి.  గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా వానలు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలను కుదిపేశాయి.  జలశయాలకు భారీగా నీరు వచ్చి చేరింది. నిండు కుండను తలపించాయి. అలాగే కొన్ని చోట్ల వరదలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  రైతులకు అపార పంట నష్టాన్ని తెచ్చిపెట్టాయి.  ఇక నగరాల్లో పరిస్థితి చెప్పనక్కర్లేదు. రోడ్డు మోకాళ్లలోతు నీరు చేరి వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగిన సంగతి విదితమే. ఇక హైదరాబాద్ నగరంలో డ్రైనేజీ సమస్యలు తలెత్తుతున్నాయి. సాధారణంగా ఈ సమస్యలతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కానీ ఇప్పుడు ఓ సెలబ్రిటీకి డ్రైనేజీ సమస్య తలెత్తడంతో  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాల్ కార్పొరేషన్ (GHMC)కు ఫిర్యాదు చేశారు. ప్రముఖ నటుడు రాజశేఖర్.. డ్రైనేజీ లీక్ అయ్యి నీరంతా రోడ్లపైకి వచ్చి దుర్వాసన వస్తుండటంతో స్పందించిన ఆయన ఎక్స్ ఖాతా ద్వారా సమస్యను పరిష్కరించాలని జీహెచ్‌ఎంసీ అధికారులను కోరారు. ‘ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 70లోని అశ్విని హైట్స్‌లో డ్రైనేజీ లీక్‌ సమస్య చాలా రోజులుగా ఇబ్బందులకు గురి చేస్తుంది.  ఎంతో కాలంగా లీకేజీ సమస్య గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదు. సమస్యకు సత్వర పరిష్కారం చూపించండి‘ అని కోరుతూ.. అక్కడి పరిస్థితిని తెలియజేసే ఫొటోను జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయ లక్ష్మితోపాటు ఉన్నతాధికారులకు ట్యాగ్‌ చేశారు రాజశేఖర్‌.

ఇక రాజశేఖర్ సినిమాల విషయానికి వస్తే.. నితిన్ హీరోగా వచ్చిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మూవీలో  స్పెషల్ రోల్ చేశాడు. ఆ తర్వాత ఎటువంటి మూవీ ఎనౌన్స్ చేయలేదు. కాగా, ఇటీవల కల్కి మూవీ టైంలో ప్రభాస్ కల్కి 2898ఏడీకి బదులు తన మూవీ కల్కి చిత్రానికి టికెట్స్ బుక్ కావడంపై ఫన్నీగా స్పందించాడు. కాాగా, శర్వానంద్ నెక్ట్స్ చిత్రంలో రాజశేఖర్ నటించబోతున్నాడని ఓ న్యూస్ వైరల్ అయ్యింది. మరీ ఇది ఎంత నిజమో ఆయనే చెప్పాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom