iDreamPost
android-app
ios-app

గోషా మహాల్ లో మరోసారి విజయం సాధించిన రాజా సింగ్

గోషా మహల్ నుంచి పోటీ చేసిన రాజా సింగ్ మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ విక్టరీని తన ఖాతాలో వెసుకున్నారు. ఆయనతో పాటు రాష్ట్రంలో బీజేపీ నుంచి ముగ్గురు అభ్యర్థులు గెలుపొందారు.

గోషా మహల్ నుంచి పోటీ చేసిన రాజా సింగ్ మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ విక్టరీని తన ఖాతాలో వెసుకున్నారు. ఆయనతో పాటు రాష్ట్రంలో బీజేపీ నుంచి ముగ్గురు అభ్యర్థులు గెలుపొందారు.

గోషా మహాల్ లో మరోసారి విజయం సాధించిన రాజా సింగ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ తీర్పు ఏ మాత్రం తీసిపోకుండా ఎగ్జాక్ట్ అవే ఫలితాలు కనబడుతున్నాయి. ఇకపోతే, గోషామహల్ లో బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసిన రాజాసింగ్ మరోసారి గెలిచి తన సత్తాను చాటుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై స్వల్ప మెజారిటీతో రాజా సింగ్ విజయం సాధించారు. అయితే, రాజా సింగ్ 2014, 2014, 2023లో వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ విక్టరీని తన ఖాతాలో వెసుకున్నారు. కాగా, రాష్ట్రంలో బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఇప్పటికీ నాలుగు స్థానాల్లో గెలుపొందారు. నిజామాబాద్ అర్భన్ లో ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ లో రాకేష్ రెడ్డి, నిర్మల్ లో మరో అభ్యర్థితో పాటు ఇప్పుడు రాజా సింగ్ విజయం సాధించారు.

వీరి గెలుపుతో బీజేపీ పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చాలా చోట్ల మా పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఉన్నట్లు బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక కొడంగల్ లో టీపీసీసీ చీఫ్ రెవంత్ రెడ్డి పట్నం నరేందర్ రెడ్డిపై 32,800 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటి రెడ్డి బ్రదర్స్ సైతం విజయం సాధించారు. వీరితో పాటు ములుగు నుంచి సీతక్క సైతం మరోసారి విజయం ఢంకా మోగించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. తెలంగాణలో హస్త హవా వీస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ నాయలకులు, కార్యకర్తలు సంభరాలు చేసుకుంటున్నారు.