iDreamPost
android-app
ios-app

వర్ష బీభత్సం.. పిడుగుపాటుకు 10 మంది మృతి

  • Published Sep 03, 2023 | 10:31 AM Updated Updated Sep 03, 2023 | 10:31 AM
  • Published Sep 03, 2023 | 10:31 AMUpdated Sep 03, 2023 | 10:31 AM
వర్ష బీభత్సం.. పిడుగుపాటుకు 10 మంది మృతి

నెల రోజులుగా జాడపత్తా లేకుండా పోయిన వానలు.. తిరిగి వచ్చాయి. శనివారం రాత్రి నుంచి హైదరాబాద్‌తో సహ దేశవ్యాప్తంగా పలు చోట్ల కుండపోత వర్షం కురిసింది. ఇక హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల్లో.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. రోడ్ల మీద వాన నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. తెల్లవారుజాము నుంచి కురుస్తోన్న వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో.. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరో రెండు రోజుల పాటు.. రాష‍్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు చోట్ల తేలిపాకటి నుంచి మోస్తర వర్షాలు కురిస్తాయని తెలిపారు. ఉత్తర బంగాళాఖాతంలో ఇవాళ తుపాను ఆవర్తనం ఏర్పడే అవకాశముందని, ఆ తర్వాత 48 గంటల్లో అది అల్పపీడనంగా మారొచ్చని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఇక ఒడిశాలో పరిస్థితి దారుణంగా ఉంది. పిడుగుపాటు కారణంగా రాష్ట్రంలో 10 మంది మృతి చెందగా.. ముగ్గురు గాయాలపాలయ్యారు. ఇక శనివారం పిడుగుపాటు కారణంగా 6 జిల్లాల్లో సుమారు 10 మంది మృతి చెందగా.. ముగ్గురు గాయపడ్డారని స్పెషల్‌ రిలీఫ్‌ కమిషనర్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడిం,చింది.