Police Patrolling On Bicycles: సైకిల్ పై పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు! ఎందుకంటే..

సైకిల్ పై పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు! ఎందుకంటే..

Police Patrolling On Bicycles: సాధారణంగా పోలీసులు కార్లలో పెట్రోలింగ్ చేయడం చూశాం. రాత్రుళ్లు కార్లలో నగరాల్లో, గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుంటారు. అయితే తాజాగా రాచకొండ పోలీసులు మాత్రం సైకిల్ పై పెట్రోలింగ్ నిర్వహించారు. ఎందుకంటే...

Police Patrolling On Bicycles: సాధారణంగా పోలీసులు కార్లలో పెట్రోలింగ్ చేయడం చూశాం. రాత్రుళ్లు కార్లలో నగరాల్లో, గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుంటారు. అయితే తాజాగా రాచకొండ పోలీసులు మాత్రం సైకిల్ పై పెట్రోలింగ్ నిర్వహించారు. ఎందుకంటే...

సమాజంలో నేరాలు, అవినీతి, అక్రమాలను అరికట్టడంలో పోలీసులే కీలక పాత్ర వహిస్తుంటారు. అంతేకాక ప్రజలకు  పోలీసులే రక్షణ కల్పిస్తుంటారు. ప్రజలు ఏదైన సమస్య వస్తే నాయ్యం కోసం పోలీసుల వద్దకే వెళ్తుంటారు. ఈ క్రమంలో విషయం తెలుసుకుని పరిష్కరిస్తుంటారు. ఇది ఇలా ఉంటే రాత్రుళ్లు కొందరు ఆకతాయిలు తోటి వారిని ఇబ్బంది పెడుతుంటారు. అంతేకాక రాత్రులు కొందరు వివిధ రకాల నేరాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి వాటిని అరికట్టేందుకు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుంటారు. అయితే తెలంగాణ పోలీసుల సైకిల్ పై పెట్రోలింగ్ చేస్తూ.. అందరిని ఆకట్టుకున్నారు. మరి… ఎక్కడ, ఎందుకు అలా సైకిల్ పై పెట్రోలింగ్ చేశారు?. ఆ వివరాలు తెలుసుకుందాం..

సాధారణంగా రాత్రుళ్ల  సమయంలో నేరాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.  దాడులలకు పాల్పడటం, గొడవలు చేయడం, హత్యచారాలు, దోపిడీలు, దొంగతనాలు రాత్రుళ్లు  ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే అలాంటి వాటిని అరికట్టేందుకు పోలీసులు పెట్రొలింగ్ నిర్వహిస్తుంటారు. కారులో కొందరు పోలీసులు ప్రధాన రహదారులు, కాలనీలు, వీధుల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుంటారు. ఎవరైనా అతిగా ప్రవర్తించినా, గొడవలు జరుగుతున్న వెంటనే ఈ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు అప్రమత్తమై వాటిని నివారిస్తారు.  ఇలా హైదరాబాద్ నగరంలో పెట్రోలింగ్ వ్యవస్థ విసృత్తంగా జరుగుతుంది.

ఇలా పోలీసులు కార్లలో పెట్రోలింగ్ చేయడం మనం చూశాం. అయితే రాచకొండ సీపీ సుధీర్ బాబు ఆదేశాలతో సైకిల్ పై పెట్రోలింగ్ ను ప్రారంభించారు. యాదాద్రి జిల్లాలో పోలీసులు సైకిల్ పై పెట్రోలింగ్ ను మొదలు పెట్టారు. జిల్లాలోని పలు పోలీస్​ స్టేషన్ల పరిధిలో సైకిల్​పై పోలీసులు పెట్రోలింగ్​ చేస్తున్నారు. పెట్రోలింగ్​లో భాగంగా వివిధ గ్రామాల్లో పోలీసులు సైకిల్ పై పర్యటిస్తున్నారు. అంతేకాక అక్కడి యువతకు డ్రగ్స్​, గంజాయి వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. వాటి​ వల్లన కలిగే అనర్థాలను పోలీసులు వివరిస్తున్నారు.

అలానే సమాజంలో జరిగే నేరాలను అరికట్టడంలో ప్రజలకు కూడా పోలీసులకు సహకరించాలని తెలిపారు. అంతేకాక ఏదైన ఘటన జరిగినప్పుడు వెంటనే పోలీసులకు సమచారం అందించాలని అన్నారు. మొత్తంగా సైకిల్ పై పోలీసులు పెట్రోలింగ్ చేయడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పటి వరకు కారులో పోలీసులు పెట్రోలింగ్ చేయడం చూశాం..కానీ సైకిల్ పై పెట్రోలింగ్ చాలా కొత్తగా ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇక సైకిల్ పై పోలీసులు పెట్రోలింగ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి..సైకిల్ పై పోలీసులు పెట్రోలింగ్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments