iDreamPost
android-app
ios-app

5 ఏళ్లలోపు పిల్లలున్న తల్లిదండ్రులకు బిగ్ అలెర్ట్! అస్సలు మిస్ కాకండి!

  • Published Mar 02, 2024 | 5:05 PMUpdated Mar 02, 2024 | 5:05 PM

Pulse Polio Drops: ఏ తల్లిదండ్రులకైనా కావాల్సింది పిల్లలు ఆరోగ్యంగా ఉండటమే. అలా వారు ఆరోగ్యంగా ఉండాలంటే.. కొన్ని పనులు తప్పకుండా చేయాలి. అలాంటి ఒక ముఖ్యమని పని గురించి ఇప్పుడు గుర్తుచేస్తున్నాం..

Pulse Polio Drops: ఏ తల్లిదండ్రులకైనా కావాల్సింది పిల్లలు ఆరోగ్యంగా ఉండటమే. అలా వారు ఆరోగ్యంగా ఉండాలంటే.. కొన్ని పనులు తప్పకుండా చేయాలి. అలాంటి ఒక ముఖ్యమని పని గురించి ఇప్పుడు గుర్తుచేస్తున్నాం..

  • Published Mar 02, 2024 | 5:05 PMUpdated Mar 02, 2024 | 5:05 PM
5 ఏళ్లలోపు పిల్లలున్న తల్లిదండ్రులకు బిగ్ అలెర్ట్! అస్సలు మిస్ కాకండి!

చిన్న పిల్లలని పెంచి, పెద్ద చేయడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. నిరంతరం వారిని ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. ఆటపాటల దగ్గర నుంచి ఆరోగ్యం, ఆహారం, నిద్ర, పెంపకం అన్నీ ఒక క్రమ పద్దతిలో జరగాలి. వీటిలో ఏ ఒక్కటి తేడా వచ్చినా.. మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది. చాలా చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తలు తీసుకోక చనిపోతున్న చిన్నారులు వేలల్లో ఉన్నారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లలకి టీకాలు, పోలియో డ్రాప్స్ వేయించడం అనేది సరైన వయసులో సక్రమంగా జరిగిపోవాల్సిన చర్య. ఒకప్పుడైతే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇంట్లో ఎవరో ఒకరు ఈ బాధ్యత తీసుకునేవారు. తరువాత కాలంలో ఉమ్మడి కుటుంబాలు పోయినా.. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకి వెళ్లడం కాకూండా.. ఒక్కరు ఇంట్లో ఉండేవారు. దాంతో.. ఈ పోలియో డ్రాప్స్ వేయించడం అనేది చాలా వరకు మిస్ అయ్యేది కాదు. అయితే.., ఇప్పుడు పెరిగిన ఖర్చుల నేపథ్యంలో ఇద్దరూ ఉద్యోగం చేయడం అనివార్యం అయ్యింది. ఇలాంటి సమయంలో పిల్లల ఆరోగ్యం దెబ్బతినకుండా, భవిష్యత్ లో వారికి ఎలాంటి సమస్యలు రాకుండా టీకాలు, పోలియో డ్రాప్స్ వేయించడం చాలా మంది తల్లిదండ్రులు మర్చిపోతున్నారు.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో పోలియో డ్రాప్స్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈ ఆదివారం కూడా ఈ కార్యక్రమం నడుస్తుంది. 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఈ పోలియో డ్రాప్స్ వేయించాలని వైద్యులు సూచిస్తున్నారు. మీ దగ్గరలోని కేంద్రాల్లో ఈ డ్రాప్స్ వేయించడం చాలా సులభం. ఇందుకోసం ఎలాంటి డాక్యుమెంట్స్ అడగరు. బయట రాష్ట్రాల వారైనా సరే అస్సలు పట్టింపు ఉండదు. మీ చిన్నారులకి ఇప్పటికే పోలియో వైరస్ టీకా వేయించి ఉన్నా.., ఇప్పుడు ప్రభుత్వం వారు అందించే పోలియో డ్రాప్స్ వేయించాలని నిపుణులు సూచిస్తున్నారు.

పోలియో పూర్తి పేరు పోలియోమైలిటిస్. ఇది ఒక రకమైన అంటు వ్యాధి. అప్పట్లో దీనీపై అవగాహన లేక, సరైన టీకాలు, మందులు, పోలియో చుక్కలు లేక లక్షల మంది ఈ వ్యాధిన పడి.. అంగవైకల్యానికి గురి అయ్యారు. అయితే.. తరువాత కాలంలో వైద్య నిపుణులు దీని నివారణకు మందులు కనిపెట్టి, అందరికీ పోలియో చుక్కలు, టీకాలు వేసి.. వ్యాధిని నివారించగలిగారు. అయితే.. చిన్నారుల్లో బలం తక్కువ ఉంటుంది కాబట్టి.. ఈ వైరస్ ని తట్టుకోవడానికి పోలియో చుక్కలు ఎంతగానో ఉపయోగపడుతాయి. “వేయించక్క పోలియో చుక్క”, “నిండు జీవితానికి రెండే చుక్కలు” అంటూ అప్పట్లో విద్యార్థుల చేత కూడా ప్రచారం చేయించి ప్రజల్లో అవగాహన పెంచిన సందర్భాలు ఉన్నాయి. అంతలా ఈ వైరస్ పై మనం యుద్ధం చేసి ఆల్మోస్ట్ విజయం సాధించేశాం. అయితే.., ఈ బిజీ లైఫ్ లో పడి మళ్ళీ పోలియో చుక్కలు వేయించడం మర్చిపోకండి. ఈ ఆదివారం మీకు దగ్గరలోని పోలియో కేంద్రాలకు వెళ్లి.., పిల్లలకి పోలియో చుక్కలు వేయించండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి