Arjun Suravaram
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. ఆరు గ్యారెంటీల లబ్ధి పొందేందుకు జనం ఆఫీసుల వద్ద క్యూ లైన్లలో నిలబడి దరఖాస్తులను అందజేస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. ఆరు గ్యారెంటీల లబ్ధి పొందేందుకు జనం ఆఫీసుల వద్ద క్యూ లైన్లలో నిలబడి దరఖాస్తులను అందజేస్తున్నారు.
Arjun Suravaram
తెలంగాణలో ఆరు గ్యారంటీల నినాదంతో ఎన్నికల ముందు కాంగ్రెస్ జనాల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి.. అధికారంలోకి వచ్చింది. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు..కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. ముఖ్యంగా ఆరు గ్యారంటీలు అమలు చేసేందుకు ప్రజాపాలన ఫారాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఫారాలు నింపి అధికారులకు అందించాలని ప్రజలకు తెలిపింది. దీంతో గత కొన్ని రోజుల నుంచి ప్రజలు ప్రజాపాలన ఫారాలు నింపుతున్నారు. తాజాగా ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ప్రజాపాలనకు శివుడు కూడా దరఖాస్తు చేసుకున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇక అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆరు గ్యారంటీల అమలు దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ అడుగు వేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే మహలక్ష్మి పేరుతో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందిస్తున్న సంగతి తెలిసిందే. అలానే గ్యాస్ సిలిండర్ ను రూ.500 లకు అందించే విషయంలోనూ కసరత్తులు చేస్తుంది. ఇక కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల కోసం డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు.
ప్రజాపాలన ఫారం ద్వారా ప్రజలకు తమకు అందాల్సిన ప్రభుత్వ పథకాల, రేషన్ కార్డు వంటి అధికారులకు తెలియజేశారు. నిన్నటితో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కోటి 25 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల డేటాను ప్రభుత్వం జనవరి 17 న ఆన్ లైన్ లో ఎంట్రీ చేయనుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని వారు కంగారు పడాల్సిన అవసరం లేదు. మరికొద్ది రోజుల్లో మరోసారి ఈ కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రజాపాలనలో దేవుడి పేరుతో దరఖాస్తు చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.
హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో శివయ్య పేరుతో అభయహస్తంకు దరఖాస్తు చేశారు. ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి శివుడికి అభయహస్తంకు అప్లయ్ చేశారు. ఇక ఫారంలో దరఖాస్తుదారుడి పేరు శివుడిగా, భార్య పేరు పార్వతిదేవిగా కుమరులపేర్లు కుమారస్వామి, వినాయకుడిగా పొందుపర్చాడు. తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గృహలక్ష్మి, గృహజ్యోతితో పాటు ఇతర స్కీమ్స్ కు అప్లయ్ చేశారు. దేవుడి పేరుతో ప్రజాపాలనలో దరఖాస్తు చేయడం స్థానికులతో పాటు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం శివుడి పేరుతో నమోదైన దరఖాస్తు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ప్రజాపాలనలో ఆరు గ్యారంటీలు కావాలని దరఖాస్తు చేసుకున్న శివుడు
హనుమకొండ – భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో శివుడి పేరుతో ఓ అప్లికేషన్ వచ్చింది. దరఖాస్తుదారుడి భార్య పార్వతి, కుమారుల పేర్లు కుమారస్వామి, వినాయకుడు అని ఉంది. pic.twitter.com/ugJoBEBNWc
— Telugu Scribe (@TeluguScribe) January 7, 2024