KTRకు తగిన ప్రత్యామ్నాయం.. తెలంగాణ IT మినిస్టర్ గా కొత్త పేరు!

KTR: తెలంగాణలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ నేపథ్యంలో అందరిలో ఐటీ శాఖ మంత్రి ఎవరు అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో మాజీ మంత్రి కేటీఆర్ కి సరితూగే వ్యక్తి ఎవరు అనే ప్రశ్నకు ఓ ఎమ్మెల్యే పేరు బలంగా వినిపిస్తోంది.

KTR: తెలంగాణలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ నేపథ్యంలో అందరిలో ఐటీ శాఖ మంత్రి ఎవరు అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో మాజీ మంత్రి కేటీఆర్ కి సరితూగే వ్యక్తి ఎవరు అనే ప్రశ్నకు ఓ ఎమ్మెల్యే పేరు బలంగా వినిపిస్తోంది.

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. దాదాపు పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైంది. ఇదే సమయంలో 64 సీట్లు సాధించి… విజయకేతనం ఎగేరిసింది కాంగ్రెస్. అంతేకాక ఎంతో ఉత్కంఠంగా సాగిన ‘తెలంగాణ సీఎం ఎవరు’ అనే అంశంపై స్పష్టత వచ్చింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా, సీఎంగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ఇక మిగిలింది మంత్రి వర్గ కూర్పు.  ఈ నేపథ్యంలోనే ఐటీ మంత్రి ఎవరు అనే దానిపై అందరిలో ఆసక్తి పెరిగింది. కేటీఆర్ ను మరిపించే ఐటీ మంత్రిగా ఎవరు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఓ ఎమ్మెల్యే సరైనోడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వరుసగా రెండు పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రెండు సార్లు కల్వకుంట్ల తారకరామారావు ఐటీ మంత్రిగా పని చేశారు. ఇక తనదైన  పనితీరుతో ఆ శాఖకే  కేటీఆర్ కొత్త వన్నెను తీసుకొచ్చారు. యువత కేవలం ఉద్యోగాలపైనే ఆధారపడకుండా ఉద్యోగాలను సృష్టించే వ్యాపార వేత్తలుగా ఎదగాలని టి-హబ్  అనే వేదికను ప్రారంభించారు. ఇది పూర్తిగా కేటీఆర్ ఆలోచన నుంచి పుట్టిందే. ఏడేళ్లు తిరిగే సరికి  టి-హబ్ ప్రపంచ స్థాయిలో స్టార్టప్ లకు వేదికైంది.

అంతేకాక ఐటీని భాగ్యనగరానికే పరిమితం కాకుండా రాష్ట్రంలోని టూ టైర్ నగరాలకు కూడా విస్తరించారు.  ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్ లో తమ కార్యకలాపాలు సాగించేలా కేటీఆర్ చొరవ తీసుకున్నారు.  దిగ్గజ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టేలా కేటీఆర్ కృషి చేశారు. తాజాగా బీఆర్ఎస్ ఓటమి తరువాత అలాంటి డైనమిక్ ఐటీ మంత్రి దొరకరని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో ఐటీపై కేటీఆర్ తనదైన ముద్రవేశారని అంతటి సమర్థత ఉన్న వ్యక్తి కాంగ్రెస్ లో ఉన్నాడా? అనే ప్రశ్నలు కూడా లేవనెత్తారు.

నెటిజన్లు వేసిన ఈ ప్రశ్నలకు తాజాగా కాంగ్రెస్ మద్దతుదారాలు ట్విట్టర్ లో పోస్టు పెడుతున్నారు.  కేటీఆర్ కు సరిసమానమైన వ్యక్తులు కాంగ్రెస్ లో ఉన్నారని తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మదన్ మోహన్ రావు పేరును ఐటీ మంత్రిగా కొందరు కాంగ్రెస్ పార్టీ అభిమానులు సూచిస్తున్నారు. ఇక మదన్ మోహన్ రావు గురించి చెప్పాలంటే.. ఆయన ది వార్టన్ స్కూల్ నుండి ఎంబీఏను పూర్తి చేశాడు.

యూఎస్ఎం బిజినెస్ సిస్టమ్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌గా కూడా మోహన్ రావు వ్యవహరించాడని చెప్పుకొచ్చారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐటీ మంత్రి మంత్రిత్వశాఖకు ఆయన సరైనోడని అంటున్నారు. మోహన్ రావు ఉన్నత విద్యావంతుడని, కమ్యూనికేషన్స్ స్కిల్స్ పుష్కలంగా ఉన్నాయని కేటీఆర్‌ స్థానాన్ని కచ్చితంగా భర్తీ చేస్తాడని కాంగ్రెస్ మద్దతు దారులు ట్విట్టర్ లో పోస్టు చేస్తున్నారు. మరి.. ఈ వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments