iDreamPost
android-app
ios-app

మాజీ సీఎం KCR ఇంటి సమీపంలో క్షుద్ర పూజల కలకలం!

మాజీ సీఎం, బీఆర్ అధినేత కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ ప్రదేశంలో క్షుద్ర పూజల వస్తువులు పడివుండటం కలకలం రేపింది. హైదరాబాద్ లోని నందినగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.

మాజీ సీఎం, బీఆర్ అధినేత కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ ప్రదేశంలో క్షుద్ర పూజల వస్తువులు పడివుండటం కలకలం రేపింది. హైదరాబాద్ లోని నందినగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.

మాజీ సీఎం KCR ఇంటి సమీపంలో క్షుద్ర పూజల కలకలం!

ప్రస్తుత సమాజం సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. మనిషి భూమి నుంచి విశ్వంలోకి సైతం వెళ్తున్నాడు.  అలానే ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు నేటి సమాజంలో జరుగుతున్నాయి. ఇలా సాంకేతికంగా అభివృద్ధి ఓ వైపు కనిపిస్తుంటే.. మరోవైపు మాత్రం క్షుద్రపూజలు, చాతబడి వంటి మూఢనమ్మకాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా క్షుద్ర పూజలకు సంబంధించిన ఘటనలు తరచూ ఏదో ఒక ప్రాంతంలో కనిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల  చంద్రశేఖర్ రావు ఇంటికి పక్కన క్షుద్ర పూజల కలకలం రేపాయి. పూర్తి వివరాలోకి వెళ్తే..

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇంటికి సమీపంలో క్షుద్రపూజల కలకలం రేపాయి. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని కేసీఆర్ ఇంటి పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో.. క్షుద్రపూజలు చేసినట్టుగా ఆనవాళ్లు కనిపించాయి. కేసీఆర్ ఇంటికి సమీపంలోని ఓప ఖాళీ ప్రదేశంలో బొమ్మ, నిమ్మకాయలు, మిరపకాయాలు, ప్లాస్టిక్ కవర్ లో నల్లకోడి, దాని ఈకలు ఉన్నాయి. అంతేకాక ఓ చీర ముక్క,కుంకుమ, పసుపుతో ముగ్గు వేసిన ఆనవాళ్లు కనిపించాయి. ప్రస్తుతం ఈ క్షుద్రపూజలు  సర్వత్రా కలకలం రేపుతోన్నాయి. మంగళవారం ఉదయం  అటుగా వెళ్లిన స్థానికులు కొందరు గమనించారు. వెంటనే కేసీఆర్ సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో వారు ఇచ్చిన సమాచారంతో బంజారాహిల్స్ పోలీసులు ఆ స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆ క్షుద్ర పూజలు జరిగిన ప్రదేశం పక్కన కేసీఆర్ ఇళ్లు ఉంది.  అందుకే ఈ అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే.. ప్రస్తుతం కేసీఆర్ బంజారాహిల్స్ లోని నందినగర్‌ నివాసంలో ఉండటం లేదని తెలుస్తోంది. ఆయన తన ఫామ్‌హౌస్‌లో ఉన్నట్లు సమాచారం. నందినగర్ లోని కేసీఆర్ నివాసంలో ఆయన కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కుటుంబం ఉంటోంది. ఈ ఘటనకు పాల్పడిన వారు ఎవరూ అనే విషయం కనిపెట్టే పనిలో పోలీసులు ఉన్నారు. ఇది ఎవరైనా కావాలనే చేశారా లేదా ఆకతాయిల  పనినా అనేది తెలియాల్సి ఉంది.

అసలే ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం, పార్టీ నుంచి కీలక నేతలంతా ఒక్కొక్కరు పార్టీని వీడటం జరిగింది. అలానే కవిత అరెస్ట్ వంటి అంశాల జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఇంటి సమీపంలో క్షుద్ర పూజల ఘటన చోటుచేసుకోవడం బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల్లో చర్చనీయాంశమైంది. ఒకవైపు వరుస నష్టాల నుంచి బయటపడేందుకు పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో తాజాగా వాస్తు మార్పులు చేయించారని తెలుస్తోంది. ఇంతలోనే కేసీఆర్ ఇంటి సమీపంలో క్షుద్ర పూజలు వెలుగుచూడటం అందరిలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ క్షుద్రపూజలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.