Dharani
Ponnam Prabhakar-TGSRTC: తెలంగాణలోని మహిళా సంఘాలకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వారికి, ఆర్టీసీకి మేలు కలిగేలా నిర్ణయం తీసుకోబోతున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. ఆ వివరాలు..
Ponnam Prabhakar-TGSRTC: తెలంగాణలోని మహిళా సంఘాలకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వారికి, ఆర్టీసీకి మేలు కలిగేలా నిర్ణయం తీసుకోబోతున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. ఆ వివరాలు..
Dharani
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం కోసం మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీని అమలు చేస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్న నేపథ్యంలో బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఫ్రీ జర్నీ అమలు చేస్తోన్న దగ్గర నుంచి బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య పెరుగుతోంది. దాంతో పురుషులు, విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తాము టికెట్ తీసుకుని కూడా నిల్చుని ప్రయాణం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రద్దీకి సరిపడా బస్సులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల మహిళా సంఘాలకు మేలు కలుగుతుందని అంటున్నారు. ఆ వివరాలు..
తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. సగటున రోజుకు 50 లక్షల మంది వరకు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో కొత్త బస్సుల కొనుగోలుపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక కామెంట్స్ చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే 700 కొత్త బస్సులను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీని బలోపేతం చేసేందుకు గాను ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తుల నుంచి బస్సుల్ని అద్దెకు తీసుకుంటున్నామని.. రాష్ట్రంలో 600 వరకు మండలాలున్నాయిని.. ఒక్కో మహిళా మండల సమాఖ్య నుంచి ఒకటి చొప్పున.. బస్సులు కొనుగోలు చేస్తామన్నారు. కేవలం గ్రామాల్లో ఉన్న మహిళా సంఘాలకే కాక పట్టణ మహిళా సంఘాలకు కూడా ఈ అవకాశం కల్పించి.. మొత్తం 700 వరకు కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణానికి అనుగుణంగా మహిళా సంఘాల సహకారంతోనే పల్లెవెలుగు వంటి బస్సుల కొనుగోలుకు తమ ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పారు. దీని వల్ల అటు మహిళా సంఘాలకు, ఇటు ఆర్టీసీకి ఆదాయం సమకూరుతుందన్నారు.