iDreamPost
android-app
ios-app

Hyderabad:మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దేశంలో తొలిసారిగా ఇకపై ఆ సేవలు

  • Published Sep 16, 2024 | 11:51 AM Updated Updated Sep 16, 2024 | 11:51 AM

హైదరాబాద్‌లో మెట్రో ప్రయాణికులకు తాజాగా ఓ తీపి కబురు అందింది. ఇక నుంచి మెట్రోలో తొలిసారిగా ఆ సేవలను కూడా అందించనున్నారు.

హైదరాబాద్‌లో మెట్రో ప్రయాణికులకు తాజాగా ఓ తీపి కబురు అందింది. ఇక నుంచి మెట్రోలో తొలిసారిగా ఆ సేవలను కూడా అందించనున్నారు.

  • Published Sep 16, 2024 | 11:51 AMUpdated Sep 16, 2024 | 11:51 AM
Hyderabad:మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దేశంలో తొలిసారిగా ఇకపై ఆ సేవలు

హైదరాబాద్ నగరవాసులకు అత్యంత వేగవంతమైన, సౌకర్యవంతమైన రవాణాల్లో మెట్రో ప్రయాణం కూడా ఒకటి. ఇది మిగతా ప్రయాణాలతో పొల్చితే నిమిషాల వ్యవధిలో ప్రయాణికులకు తమ గమ్యస్థానాలకు చేర్చుతుంది. పైగా తక్కువ ఖర్చుతో కూడుకున్నది కావునా.. నగరంలో ఈ మెట్రో సేవలు ప్రధాన రవాణాగా మారిపోయింది. ఈ క్రమంలోనే.. ఆఫీసులకు, స్కూల్లకు, కాలేజీలకు వెళ్లలసిన వారందరూ ఈ మెట్రో ప్రయాణం పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తాజాగా ఓ గుడ్ న్యూస్ అందింది. ఇకపై ప్రయాణికులకు ఆ సమస్యలు కూడా లేకుండా ప్రశాంతంగా ప్రయాణించే సేవలను దేశంలో తొలిసారి అందించనున్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

హైదరాబాద్‌లో మెట్రో ప్రయాణికులకు తాజాగా ఓ తీపి కబురు అందింది. ఇక నుంచి మెట్రో స్టేషన్‌లలోనే ఆరోగ్య సేవలు కూడా అందించనున్నారు. ఈ మేరకు ఈ సేవలను ఎల్బీనగర్‌ మెట్రో స్టేషన్ లో ప్రారంభించారు. అయితే ఈ ఆరోగ్య సేవలు అనేవి దేశంలో.. మొట్ట మొదటిసారిగా హైదరాబాద్ మెట్రో స్టేషన్ లలో అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. ఇకపోతే ఈ సేవలు అనేవి మిట్టా ఎక్స్ లెన్స్ ఆధ్వర్యంలో ఆదివారం (సెప్టెంబర్ 15న) రోజున ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్‌ పాలీ హెల్త్ క్లినిక్ గా అందుబాటులోకి వచ్చింది. అయితే దీనికి ముఖ్య అతిథిగా మెట్రో రైలులో ప్రయాణిస్తూ విచ్చేసిన మేయర్ గద్వాల విజయలక్ష్మి ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మెట్రో ప్రయాణికులతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఈ వైద్య సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు. అలాగే మొదటిసారిగా హెల్త్ ఏటీఎం కూడా అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. అయితే ఇక్కడ రక్త పరీక్షల డయాగ్నస్టిక్ సౌకర్యం, మెడికల్ షాప్, వైద్య నిపుణులు, ఫిజియోథెరపి, టెలి మెడిసిన్, డెంటల్ కేర్ ఇలా అన్నీ సేవలు ఈ మెట్రో స్టేషన్లలో అందుబాటులో ఉన్నాయని, పైగా ఆధునిక కార్పొరేట్ స్థాయి వైద్యం మెట్రో అందించడం దేశంలో తొలిసారని విజయలక్ష్మి చెప్పుకొచ్చారు.

అయితే దేశంలో తొలిసారి మెట్రో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల గురించి ఇలాంటి సేవలు అందుబాటులోకి తీసుకురావడం నిజంగా గొప్ప విషయమని నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి సేవలు అందుబాటులోకి రావడం వలన తరుచు మెట్రోలో ప్రయాణించే లక్షలాది మంది ప్రయాణికులకు ఎలాంటి అనారోగ్యానికి గురైనా వెంటనే చికిత్స అందించే విధంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ లో ప్రారంభించే ఈ ఆరోగ్య సేవలు.. త్వరలోనే మియాపూర్, రాయదుర్గం మెట్రో స్టేషన్లలో కూడా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. మరీ, దేశంలో తొలిసారిగా మెట్రో స్టేషన్ లో ఇలాంటి సేవలు అందుబాటులోకి రావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.