P Venkatesh
వాహనదారులకు, మెకానిక్ లకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై అలా చేశారంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ ఏ విషయంలో అంటే?
వాహనదారులకు, మెకానిక్ లకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై అలా చేశారంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ ఏ విషయంలో అంటే?
P Venkatesh
రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు కొత్త నియమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించే వాహనదారులకు భారీగా జరిమానాలు విధిస్తూ ఉక్కుపాదం మోపుతున్నారు. అయినప్పటికీ కొంతమంది వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ ను గాలికొదిలేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ముఖ్యంగా బైక్ సైలెన్సర్లను మార్చి ఎక్కువ సౌండ్ వచ్చే సైలెన్సర్లను వినియోగిస్తూ రోడ్లపై నానా రచ్చ చేస్తున్నారు. దీంతో సౌండ్ పొల్యూషన్ పెరగడంతో పాటు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సైలెన్సర్లను మార్చితే బైక్ యజమానులతో పాటు మెకానిక్ లపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
హైదరాబాద్ రోడ్లపై పలువురు పోకిరీలు బైక్ ల సైలెన్సర్లు మార్చి విపరీతమైన శబ్ధం వచ్చే వాటిని ఉపయోగిస్తూ హల్ చల్ చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని వాహనదారులకు బిగ్ అలర్ట్. బైక్ యజమానులకు, మెకానిక్ లకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. బైక్, యాక్టివా సహా ఎలాంటి ద్విచక్ర వాహనాలకైనా సరే ఎక్కువ శబ్ధం చేసే సైలెన్సర్లు బిగించొద్దన్నారు. ఎవరైనా వాటిని బిగించినట్లు తెలిస్తే, పరికరాలు అమ్మిన ఆటోమొబైల్ షాప్ యజమానిపైనా, మెకానిక్ పైనా, బైక్ ఓనర్ పైనా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు నగర టూవీలర్ అసోసియేషన్ మెకానిక్ సంఘం సభ్యులకు నోటీస్ ఇచ్చారు. శబ్ధకాలుష్యానికి వాహనదారులు కారకులు కావొద్దని సూచించారు.
గతంలో కూడా పోలీసులు సైలెన్సర్లు మార్చుతున్న వాహనదారులకు భారీ జరిమానాలు విధించిని విషయం తెలిసిందే. అంతేకాదు సైలెన్సర్లను ధ్వంసం చేశారు పోలీసులు. అయినా కూడా కొందరిలో మార్పు రావడం లేదు. పెద్ద పెద్ద శబ్ధాలు వచ్చే సైలెన్సర్లను వినియోగిస్తూ రోడ్లపై రచ్చ చేస్తున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై బైక్ వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను మార్చి సౌండ్ పొల్యూషన్ కు కారణమైతే, వారితో పాటు మెకానిక్ లపై కూడా కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు.